నేడు అధికారిక లాంచనాలతో మన్మోహన్ అంత్యక్రియలు.. స్మారక స్తూపం నిర్మిస్తామన్న కేంద్రం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలో శనివారం జరగనున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 11:45 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

PM Narendra Modi paying homage to Manmohan

మన్మోహన్ పార్ధీవదేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ఆర్థిక గమనాన్ని మార్చే నిర్ణయాలను తీసుకుని ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలో శనివారం జరగనున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 11:45 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు హోంశాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం వీర్ భూమి లేదా శక్తి స్థల్ లో కొంత భాగం కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. అక్కడే మన్మోహన్ సింగ్ సమాధి నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోవడంపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే మన్మోహన్ ను ప్రభుత్వం అవమానిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు యమునా నది తీరంలోని రాజ్ఘాట్ దగ్గర స్థలం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు లేఖ రాశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాయడంతోపాటు స్వయంగా ఫోన్ కూడా చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఖర్గే.. గతంలో పలువురు మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞుల అంత్యక్రియలు రాజ్ ఘాట్ లోనే జరిగాయని, అక్కడే సాంప్రదాయం ప్రకారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కోరునట్లు పేర్కొన్నారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన చేసిన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవని ఖర్గే పేర్కొన్నారు.

ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అధికారంలో ఉండి కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరగనివ్వకుండా హైదరాబాదుకు ఆయన భౌతికకాయాన్ని పంపారన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ విషయంలో అలాంటి తప్పిదం జరగకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వాస్తవానికి 2013లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేకంగా మరే నాయకుడికి స్మారకాలను ఏర్పాటు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.  రాజధానిలో స్థలాభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్మారకం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరడం చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. ఏఐసిసి కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర మొదలు కానుంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు అసహనాన్ని వ్యక్తం చేయడం పట్ల బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్