వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గి సాధారణ పరిస్థితిలో నెలకొంటున్నాయి. వరద నుంచి బయటపడగానే ముప్పు తొలగిపోయిందని భావించే పరిస్థితి లేదని తెలుస్తోంది. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత సంక్రమిత వ్యాధులు ప్రభలే ప్రమాదం పొంచి ఉందని మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే వరదలు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహణపై ఎయిమ్స్ వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలతో కూడిన బ్రోచర్ ను విడుదల చేశారు. ఇందులో వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రత, సమూహ భద్రత అంటూ మూడు అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
వరద నీటిలో విజయవాడ ప్రాంతం
వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గి సాధారణ పరిస్థితిలో నెలకొంటున్నాయి. వరద నుంచి బయటపడగానే ముప్పు తొలగిపోయిందని భావించే పరిస్థితి లేదని తెలుస్తోంది. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత సంక్రమిత వ్యాధులు ప్రభలే ప్రమాదం పొంచి ఉందని మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే వరదలు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహణపై ఎయిమ్స్ వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలతో కూడిన బ్రోచర్ ను విడుదల చేశారు. ఇందులో వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రత, సమూహ భద్రత అంటూ మూడు అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అందులో పేర్కొంది. వరద నీటిలో తిరగవద్దని, డ్రైవింగ్ చేయొద్దని సూచించింది. ఇంటి చుట్టుపక్కల మురుగునీరు లేకుండా చూసుకోవాలని, మురుగునీటిని, డ్రైన్లను వెంటనే శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. తడిగా ఉన్న విద్యుత్ ఉపకరణాలు తాకవద్దని సూచించింది. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని పేర్కొంది. చేతిపంపు నీటిని తాగవద్దు అని హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు దోమ తెరలు దోమల నివారణ మందులు వాడాలని సూచించింది. వరద బాధిత ప్రాంతాల్లోనూ ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని వివరించండి. పాములో తేళ్లు సంచరించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. తగిన వైద్యం తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని చెప్పింది. కలుషిత ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలని, క్రిమిసంహారకాలు కల్పిన నీటిని ఉపయోగించుకోవాలని తెలిపింది.
రానున్న వారం రోజులు అత్యంత కీలకం
రానున్న వారం రోజులు అత్యంత కీలకం కానుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో దోమలు జోరుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వైరల్ జ్వరాలతోపాటు ఇతర వ్యాధులు జోరుగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు. జ్వరం, ఒంటిపై దద్దుర్లు వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని, ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులు సంప్రదించి మందులు వాడాలని సూచిస్తున్నారు.