||పద్మశాలి నూతన కార్యవర్గం||
ఈవార్తలు, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ముల్క మల్లయ్య ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వడ్డేపల్లి శశాంక్, కోశాధికారిగా బొమ్మకంటి గంగాధర్, ఉపాధ్యక్షులుగా వీరబత్తిని ప్రసాద్, కస్తూరి విశ్వనాథం, ప్రధాన సలహాదారుగా కొండబత్తిని గంగాధర్, సహాయ కార్యదర్శులుగా వీరబత్తిని గంగాధర్, బూదరపు గంగమల్లు, సలహాదారులుగా శ్రీరాముల రమేశ్, బొద్దుల మహేందర్, కార్యవర్గ సభ్యులుగా కొండబత్తిని నర్సయ్య, పెంట సురేశ్, జల్ద శ్రీనివాస్, అల్లె శంకర్, బూర్ల గణేశ్, అడ్లగట్ట లింగయ్యను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల పద్మశాలి సంఘ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.