||జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్‌ను కలిసిన మల్యాల మండల నూతన కార్యవర్గ సభ్యులు||
ఈవార్తలు, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సోమవారం నూతనంగా ఎన్నుకున్న పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మల్యాల మండల అధ్యక్షుడు ముల్క మల్లయ్య.. కార్యవర్గ సభ్యులను రుద్ర శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అందరు చర్చించుకొని గ్రామగ్రామాన పద్మశాలీయుల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని తీర్మానించారు. గ్రామాల్లో కులాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించారు. మరుగున పడుతున్న చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ముక్తకంఠంతో నొక్కి చెప్పారు. ఐక్యంగా నిర్ణయాలు తీసుకొంటూ పద్మశాలి కులాభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించారు. అటు.. బీసీలకు ఇచ్చే రూ.లక్ష సాయాన్ని పద్మశాలీయులకు కూడా వర్తింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గ్రామ సంఘాలు, పద్మశాలి నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల సంఘాలు, పట్టణ సంఘాల నాయకులు పాల్గొనాలని జిల్లా సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ కోరారు. రుద్ర శ్రీనివాస్‌ను కలిసిన వారిలో మల్యాల మండల పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు సహా ముత్యంపేటకు చెందిన బాలె సంజీవ్ ఉన్నారు.
మల్యాల మండల నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు:
ముల్క మల్లయ్య - ముత్యంపేట
ప్రధాన కార్యదర్శి:
వడ్డేపల్లి శశాంక్ - మల్యాల
కోశాధికారి:
బొమ్మకంటి గంగాధర్ - బల్వంతాపూర్
ఉపాధ్యక్షుడు 1:
వీరబత్తిని ప్రసాద్ - మల్యాల
ఉపాధ్యక్షుడు 2:
కస్తూరి విశ్వనాథం - తాటిపెల్లి
ప్రధాన సలహాదారు:
కొండబత్తిని గంగాధర్ - మ్యాడంపెల్లి
సహాయ కార్యదర్శులు:
వీరబత్తిని గంగాధర్ - ఒబులాపూర్
బూదరపు గంగమల్లు -మానాల
సలహాదారులు:
శ్రీరాముల రమేశ్ - రామన్న పేట
బొద్దుల మహేంధర్ - సర్వాపూర్
కార్యవర్గ సభ్యులు:
కొండబత్తిని నర్సయ్య - తక్కల్లపెల్లి
పెంట సురేశ్ - లంబాడిపెల్లి
జల్ద శ్రీనివాస్ - రాంపూర్
అల్లె శంకర్ - మ్యాడంపెల్లి
బూర గణేశ్ - పోతారం
అడ్లగట్ట లింగయ్య - ఒబులాపూర్