||సబితా ఇంద్రరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
అభివృద్ధి సంక్షేమాన్ని మహేశ్వరం నియోజకవర్గం అక్కున చేర్చుకుందని రెడ్డి జేఏసీ అధ్యక్షుడు బొర్రా సురేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తిరిగి కారు గుర్తుకు ఓటు వేశారని అన్నారు. సవిత ఇంద్రారెడ్డి విజయం సాధించిన తర్వాత ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకొని బొకే అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి గెలిపే లక్ష్యంగా గత రెండు నెలలుగా కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్నట్లు తెలిపారు. గతంలో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సబితా నాయకత్వంలో ప్రతి సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్యకర్తల ఆనంద కోలాహలం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారు అంతే హుందాగా ప్రతిపక్షంలో కూడా భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రతిభను చాటుకుంటుందని అన్నారు తెలంగాణ జాతిపిత కేసిఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గతంలో సబితా ఇంద్రారెడ్డి పని చేశారని ఆమె చేసిన అభివృద్ధి సంక్షేమమే ఆమెను తిరిగి విజయతీరాల వైపు పయనింప చేసిందని అన్నారు ఇంకా కార్యక్రమంలో శిశుపాల్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.