మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటినుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇక్కడ బీఫాం పొందిన కిచెన్నగారి లక్ష్మారెడ్డికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రచారం రూపొందుకున్న నేపథ్యంలో అసంతృప్త నేతలతో మాట్లాడుతున్న కే ఎల్ ఆర్ స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పారిజాతా రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కిచెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మేమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులమని సోదరి పారిజాతకు ఎప్పుడు తన అండదండలు ఉంటాయని వారి మద్దతు మహేశ్వరంలో తన గెలుపుకు అదనపు బలమని పేర్కొన్నారు. పారిజాతను సొంత చెల్లెలి కంటే ఎక్కువగా గౌరవించడమే కాకుండా రాహుల్ గాంధీతో మాట్లాడి గౌరవప్రదమైన పదవి ఇప్పించడానికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. టికెట్ కోరడంలో తప్పు లేదని టికెట్ రాకపోతే ఎవరికైనా బాధగా ఉంటుందని అయినా మేమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులమని, ఈరోజు మేమంతా ఆమె ఇంటికి తరలి వెళ్లి ఆమె మద్దతు కోరామని, అన్నారు. చిగురింత పారిజాత నరసింహారెడ్డికి అభిమానులు చాలామంది ఉన్నారని వాళ్లంతా టికెట్ రాలేదన్న బాధ నుంచి బయటకు రావాలని కేఎల్ఆర్ అన్నారు. కె ఎల్ ఆర్ ను గెలిపిస్తే చీరింత పారిజాత నరసింహారెడ్డి గెలిచినట్లేనని మనమంతా గెలిచినట్లేనని పారిజాత నరసింహారెడ్డి సొంత డబ్బులతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మోసగించిందని గెలిపించిన పారిజాతనే రాజకీయంగా చంపడానికి కృషిచేసిన దుర్మార్గురాలు సబితా ఇంద్రారెడ్డి అని ఆరోపించారు. ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు అటు భారత రాష్ట్ర సమితి నాయకుడు తీగల కృష్ణారెడ్డిని సైతం రాజకీయంగా చంపేసిందని ఆయన కార్యకర్తలను తొక్కేసిందని మండిపడ్డారు. సవితమ్మను ఇక్కడ నుంచి పంపించి వేస్తేనే మహేశ్వరం నియోజకవర్గ శని విరగడం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుల అందరినీ గౌరవిస్తానని గండిపేటలో ఇల్లు అమ్మి తుక్కుగూడలో కొనుక్కున్నానని 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు తుక్కుగూడలోనే ఉంటూ సబితను ఓడిస్తానని ఐదు సంవత్సరాల సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు.

కేఎల్ఆర్ ను గెలిపించి తీరుతాం: బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి

మహేశ్వరం అభ్యర్థిగా టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేణుగోపాల్ సూచన మేరకు సోమవారం తమిళనాడు ఎంపీ తన నివాస గృహానికి వచ్చి భేటీ అయ్యారని పారిజాత తెలిపారు అనునిత్యం ప్రజలలో ఉండే వ్యక్తికి ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరారని అన్నారు బాధ్యతయుతమైన పదవి ఇప్పిస్తామని కేఎల్ఆర్ మాట ఇచ్చారని ఆయనకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ మహేశ్వరంలో కేఎల్ఆర్ గెలుపుకు కృషి చేస్తామని పారిజాత అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తమలాంటి మహిళలకు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు మేరెంట కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఉందేటి ప్రభాకర్ రెడ్డి తో పాటు రాఘవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్