మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రకు ఈనెల 20న ఎన్నికలు జరిగాయి. ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా శనివారం వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కౌంటింగ్ కు సిద్ధమవుతున్న అధికారులు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రకు ఈనెల 20న ఎన్నికలు జరిగాయి. ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా శనివారం వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ పోల్ గా చాలామంది అంచనాలు వేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బిజెపి నేతృత్వంలోని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రత బలగాలను మోకరించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి ఓటమి అధికారాన్ని దక్కించుకుంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. మహాయుతి కూటమిగా ఏర్పాటు అయిన బిజెపి 149, శివసేన (షిండే) - 81, ఎన్సిపి (అజిత్) - 59 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి కూటమిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ - 101, శివసేన (యూటీబి) -95, ఎన్సిపి (పవార్) - 86 స్థానాల్లో పోటీ చేశాయి. ఫలితాలు వెలువడిన 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో 66.05 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జార్ఖండ్ లో అధికార పీఠం ఎవరిది.?
జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 81 స్థానాలు ఉండగా మెజారిటీ రావాలంటే 41 సీట్లు సాధించాలి. కొద్దిరోజుల కిందట ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఎక్కడ జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా - కాంగ్రెస్ ఒక కూటమిగా, బిజెపి నేతృత్వంలోని మరికొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ నేతృతంలోని కూటమి అధికారంలోకి వస్తుందో అన్న ఆసక్తి సర్వత్రాల నెలకొంది.
ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. తొలి ఫలితం విడుదలయ్యేందుకు మధ్యాహ్నం 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.