ముగిసిన మహాకుంభమేళా.. 45 రోజుల్లో పుణ్యస్నానాలు చేసిన వారెందరంటే.?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ మహా కుంభమేళ ముగిసింది. మహా కుంభమేళాలో కోట్లాదిమంది హిందూ భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 45 రోజులపాటు జరిగిన ఈ మహా కార్యక్రమం అద్వితీయంగా సాగింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే ఈ మహా అద్భుతాన్ని కోట్లాదిమంది భక్తులు చూడగలగడంతోపాటు.. ఎంతోమంది పుణ్యస్నాలను ఆచరించే అవకాశాన్ని పొందారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజులో ఈ మహా కుంభమేళా జరిగింది. మహా కుంభమేళాతో పవిత్ర సంగమం పులకించింది. యావత్ దేశం ఈ మహా కుంభ మేళాను తిలకించింది. 45 రోజులు పాటు జరిగిన మహా కుంభమేళాకు 66 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.

Devotees attending Maha Kumbh Mela

మహా కుంభమేళాకు హాజరైన భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ మహా కుంభమేళ ముగిసింది. మహా కుంభమేళాలో కోట్లాదిమంది హిందూ భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 45 రోజులపాటు జరిగిన ఈ మహా కార్యక్రమం అద్వితీయంగా సాగింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే ఈ మహా అద్భుతాన్ని కోట్లాదిమంది భక్తులు చూడగలగడంతోపాటు.. ఎంతోమంది పుణ్యస్నాలను ఆచరించే అవకాశాన్ని పొందారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజులో ఈ మహా కుంభమేళా జరిగింది. మహా కుంభమేళాతో పవిత్ర సంగమం పులకించింది. యావత్ దేశం ఈ మహా కుంభ మేళాను తిలకించింది. 45 రోజులు పాటు జరిగిన మహా కుంభమేళాకు 66 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను పూర్తి చేశారు. చివరి రోజు అయిన మహాశివరాత్రి రోజు సుమారు రెండు కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 తో ముగిసింది. ఈ 45 రోజులపాటు దారులన్నీ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లు సాగింది మహా కుంభమేళ. చిన్న, పెద్ద తేడా లేకుండా కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్ రాజు బాట పెట్టారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కుంభమేళాకు హాజరై మహా పుణ్యస్నానాలను పూర్తి చేశారు. 13 అఖాడాలు మూడు ప్రధాన పండుగలు అయినా మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత పంచమి నాడు అమృత స్నానాలు చేశారు. చివరి రోజు కుంభమేళాలో భక్తులపై హెలికాప్టర్ తో మరోసారి పూల వర్షం కురిపించడంతోపాటు డ్రోన్ షో, ఎయిర్ షో నిర్వహించారు.

మౌని అమావాస్య రోజు తొక్కిసులాట మినహా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లను చేసింది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు విధుల్లో ఉన్నారు. ఘాట్లు, సంగమం దగ్గర రాష్ట్ర, కేంద్ర బలగాలతో నిఘా పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలు, యాంటీ డ్రోన్లు మొదలైన అనేక అత్యాధునిక వ్యవస్థలను ప్రయోగించారు. ట్రాఫిక్ తో భక్తుల కాస్త ఇబ్బందులు పడిన కుంభమేళాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కుంభమేళ విజయవంతంగా ముగియడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలోనే హిందువుల జనాభాలో సగం మందికి పైగా కుంభమేళాకు హాజరైనట్లు ఆయన వివరించారు. సాధారణంగా కుంభమేళా నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రయాగ్ రాజ్ లో తదుపరి మహా కుంభమేళా 2169 సంవత్సరంలో జరగనుంది. రాబోయే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో, మహారాష్ట్రలోని నాశిక్ లో కుంభమేళాలు జరుగుతాయి. హరిద్వార్ లో జరగబోయేది అర్థ కుంభమేళా, నాశిక్ లో జరగబోయేది పూర్ణకుంభమేళా. గోదావరి నది పవిత్ర ఒడ్డున నాసిక్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వర్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్థ కుంభమేళా ఆరేళ్లకు ఒకసారి వస్తుంది. పూర్ణకుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. 2028లో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లోను పూర్ణకుంభమేళా జరుగుతుంది. 2030లో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్యలో అర్థ కుంభమేళా జరుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్