పోర్న్ వీడియోలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||మద్రాస్ హైకోర్టు||

ఈవార్తలు, చెన్నై: పోర్న్ వీడియోలు చూడటంపై తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎవరికీ చూపించకుండా, తానే సొంతంగా, వ్యక్తిగతంగా చూసినా, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసినా నేరం కిందికి రాదని వెల్లడించింది. అయితే, ఆ వీడియోలను ఇతరులకు షేర్ చేస్తే మాత్రం చట్టప్రకారం శిక్షార్హులేనని స్పష్టం చేసింది. అతిగా పోర్న్ వీడియోలు చూడటం ఒక మానసిక సమస్య. దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బెటర్. ఆరోగ్యానికీ మంచిది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు అధికారులకు కీలక సూచనలు చేసింది. ‘పోర్న్ వీడియోలకు బానిసలైన వారిని నిందించటానికి బదులు ఆ అలవాటు మాన్పించేందుకు కృషి చేయాలి’ అని సూచించింది. పిల్లల అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్‌లో చూసినందుకు ఓ యువకుడిపై నమోదైన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.

కాగా, అంతకుముందు కేరళ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే వెలువరించింది. అశ్లీల చిత్రాలు, అశ్లీల వీడియోలను చూడటం నేరమేమీ కాదని పేర్కొంది. ప్రైవేటుగా వాటిని చూడడాన్ని నేరంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. ప్రైవేటుగా పోర్న్ వీడియోలు చూడటాన్ని నేరంగా పరిగణిస్తే ఆ వ్యక్తి ప్రైవసీకి విఘాతం కలిగించినట్టే అవుతుందని తేల్చిచెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నది.

ఇలా చేస్తే నేరమే..

వ్యక్తిగతంగా కాకుండా, ఇతరులకు పోర్న్ వీడియోలు చూపిస్తే అది నేరమే అవుతుంది. బలవంతంగా, ప్రలోభపెట్టి వాటిని చూపించకూడదు. అయితే, తానే ప్రైవేటుగా పోర్న్ వీడియోలు, ఫొటోలు చూస్తే భారతీయ శిక్ష్మాస్మృతిలోని సెక్షన్ 292 కింద నేరం కాదు.

వెబ్ స్టోరీస్