అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కేంద్రీకృతమై కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం బుధవారం నాటికి తమిళనాడు శ్రీలంక తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం, గురువారాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కేంద్రీకృతమై కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం బుధవారం నాటికి తమిళనాడు శ్రీలంక తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం, గురువారాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురిచే దానికి అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే, అల్పపీడనం ప్రభావంతో మంగళవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ జిల్లాలో కొనచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైయస్సార్ జిల్లాలో కొన్నిచోట్ల తెలుగు పార్టీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, వైయస్సార్, శ్రీ సత్య సాయి జిల్లాలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాకినాడ, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, అనంతపురం జిల్లాలో కొనచోట్ల తెలుగు పాట నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్