మద్యం షాపులకు సోమవారం జిల్లాలో లాటరీలు నిర్వహించనున్నారు. కలెక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి దుకాణానికి వేర్వేరుగా లాటరీ తీసి ఎంపికైన వారికి లైసెన్స్ పత్రాలు అందిస్తారు. ఉదయం నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి పడింది. ఒక్క దరఖాస్తుల రూపంలోనే రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. సోమవారం లాటరీలో షాపు దక్కించుకున్న వ్యక్తులు 24 గంటల్లోపే మొదటి విడత లైసెన్స్ చెల్లించాలి. తద్వారా సుమారు రూ.300 కోట్లు వస్తాయి.
విశాఖలో లాటరీ తీస్తున్న అధికారులు
ఏపీలో నూతనంగా అమలు చేయనున్న మద్యం విధానంలో భాగంగా కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడవగా, కూటమి ప్రభుత్వం ఈసారి ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అప్పగించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే వీటిని నిర్వహించడంతోపాటు భారీగా అక్రమాలకు పాల్పడిందంటూ కూటమితో నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం విక్రయించడంతోపాటు మద్యం విధానాన్ని మారుస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే నూతన మద్యం విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త షాపులు ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే దరఖాస్తులను స్వీకరించిన ఎక్సైజ్ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులు ఏర్పాటుకు సంబంధించి ఆయా జిల్లాల నుంచి దరఖాస్తులను కోరారు. ఆయా దుకాణాలకు సంబంధించి 89,882 దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో షాప్ కు 26.46 మంది పోటీ పడుతున్నారు. మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరణ గడువు శుక్రవారం అర్ధరాత్రి తో ముగిసింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రెండు లక్షలు చొప్పున 88,982 అప్లికేషన్లకుగాను రూ.1797.64 కోట్ల రూపాయలు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాప్ కు సగటున 52 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ పోటీ నెలకొంది ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాపుకు 132 మంది, మరో షాపుకు 120 మంది దరఖాస్తు చేశారు. ఇది రికార్డు. ఆనేక జిల్లాలో అనేక షాపులకు 70కిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక స్వయంగా సీఎం హెచ్చరించిన తిరుపతి, శ్రీ సత్య సాయి జిల్లాలో రాజకీయ జోక్యం ఆగలేదు. ఫలితంగా ఆయా జిల్లాల్లో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఇక్కడ ఒక్కో షాపుకు 17 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు సోమవారం లాటరీ తీసేందుకు ఏర్పాటు చేశారు. మద్యం షాపులకు సోమవారం జిల్లాలో లాటరీలు నిర్వహించనున్నారు. కలెక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రతి దుకాణానికి వేర్వేరుగా లాటరీ తీసి ఎంపికైన వారికి లైసెన్స్ పత్రాలు అందిస్తారు. ఉదయం నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి పడింది. ఒక్క దరఖాస్తుల రూపంలోనే రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. సోమవారం లాటరీలో షాపు దక్కించుకున్న వ్యక్తులు 24 గంటల్లోపే మొదటి విడత లైసెన్స్ చెల్లించాలి. తద్వారా సుమారు రూ.300 కోట్లు వస్తాయి. వీరు బుధవారం నుంచి షాపులు ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో లైసెన్స్ లు కనీసం వారం రోజుల సరుకు కొనుగోలు చేస్తారు. ఆ రూపంలో మరో రూ.300 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. మొత్తంగా నూతన మద్యం పాలసీ ప్రారంభ దశలోనే ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే అనేక ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసి ఆశావహులను దరఖాస్తు చేయకుండా ఇబ్బందులు గురి చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గతంలోనే ఎమ్మెల్యేలను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీని ఫలితంగానే అనేక చోట్ల దరఖాస్తులు భారీగా తగ్గినట్లు చెబుతున్నారు. దీనిపై చాలా మంది ముఖ్యమంత్రికి మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా నూతన మద్యం విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ విధానం మరింతగా ఆదాయాన్ని సమకూరుస్తుందని పేర్కొంటున్నారు.