పాన్‌ కార్డు పోయిందా.. అయితే మళ్లీ పొందండి ఇలా.!

దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనేక వ్యవహారాలకు ఇప్పుడు పాన్‌ కార్డు అవసరం అవుతోంది. ఆధార్‌ కార్డు తరహాలోనే ప్రతి ఒక్కరి వద్ద ఇప్పుడు పాన్‌ కార్డు ఉంటోంది. పాన్‌ కార్డు తప్పనిసరి కూడా అయింది. అయితే, పాన్‌ కార్డు ఎక్కువ మంది పర్సులు, జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. కొన్నిసార్లు అది ఎక్కడైనా పడిపోతే దాన్ని తిరిగి ఎలా సంపాదించాలో చాలా మందికి తెలియదు. అయితే, పోయిన్‌ పాన్‌ కార్డును మళ్లీ పొందేందుకు అవకాశం ఉంది. రెండోసారి పాన్‌ కార్డు తీసుకోవడానికి ఉన్న అవకాశాలు మీకోసం. పాన్‌ కార్డు పోయినట్టు అయితే మొదటగా దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. తద్వారా పాన్‌ కార్డుతో ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానికి మీరు బాధ్యులు కాకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనేక వ్యవహారాలకు ఇప్పుడు పాన్‌ కార్డు అవసరం అవుతోంది. ఆధార్‌ కార్డు తరహాలోనే ప్రతి ఒక్కరి వద్ద ఇప్పుడు పాన్‌ కార్డు ఉంటోంది. పాన్‌ కార్డు తప్పనిసరి కూడా అయింది. అయితే, పాన్‌ కార్డు ఎక్కువ మంది పర్సులు, జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. కొన్నిసార్లు అది ఎక్కడైనా పడిపోతే దాన్ని తిరిగి ఎలా సంపాదించాలో చాలా మందికి తెలియదు. అయితే, పోయిన్‌ పాన్‌ కార్డును మళ్లీ పొందేందుకు అవకాశం ఉంది. రెండోసారి పాన్‌ కార్డు తీసుకోవడానికి ఉన్న అవకాశాలు మీకోసం. పాన్‌ కార్డు పోయినట్టు అయితే మొదటగా దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. తద్వారా పాన్‌ కార్డుతో ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానికి మీరు బాధ్యులు కాకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో లైట్‌ తీసుకుంటే మాత్రం ఏదైనా ఆర్థిక నేరం జరిగితే పోలీసులు మిమ్మల్ని పట్టుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పాన్‌ కార్డు పోయినట్టు ఫిర్యాదు చేసిన తరువాత ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీని డూప్లికేట్‌ పాన్‌ కార్డుకు అప్లై చేసేటప్పుడు కూడా జత చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్‌ఎస్‌డీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ onlineservices.nsdl.com కు వెళ్లాలి. అక్కడ మీ పాన్‌ కార్డు నెంబర్‌, ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. తరువాత మీ పుట్టిన తేదీ నమోదు చేయాలి. పైన ఇచ్చిన సూచనలపై టిక్‌ చేసి క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్‌మిట్‌ చేయాలి. తరువాత మీ చిరునామా, పిన్‌ కోడ్‌ నిర్ధారించుకోవాలి. దాన్ని నమోదు చేసిన తరువాత మీరు రూ.50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తరువాత మీకు ఒక స్లిప్‌ వస్తుంది. అందుబాటులో ఒక ట్రాకింగ్‌ నెంబర్‌ కూడా ఉంటుంది. దాని ద్వారా మీరు మీ కొత్త పాన్‌ కార్డును ట్రాక్‌ చేయవచ్చు. కాబట్టి, పాన్‌ కార్డు పోయిన వాళ్లు ఈ ప్రక్రియను అనుసరించి కొత్త పాన్‌ కార్డును పొందవచ్చు. ఈ విషయంలో ఇబ్బందులు లేకుండా పాన్‌ కార్డు పొందవచ్చని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్