గూగుల్ పే నుంచి పది లక్షల వరకు రుణం.. లోన్ ఎవరికి ఇస్తారు అంటే.?

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశంలోని అనేక బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా గూగుల్ పే పర్సనల్ లోన్ అందించేందుకు ముందుకు వచ్చింది. గూగుల్ పే నుంచి రుణం పొందాలంటే వయసు 21 సంవత్సరాలు ఉండాలి. గూగుల్ పే నుంచి కనిష్టంగా 30,000 నుంచి 10 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. రుణ కాల పరిమితి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి వడ్డీ రేటు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు మీకోసం. గూగుల్ పే నుంచి రుణం తీసుకుంటే 10.50% నుంచి 15 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశంలోని అనేక బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా గూగుల్ పే పర్సనల్ లోన్ అందించేందుకు ముందుకు వచ్చింది. గూగుల్ పే నుంచి రుణం పొందాలంటే వయసు 21 సంవత్సరాలు ఉండాలి. గూగుల్ పే నుంచి కనిష్టంగా 30,000 నుంచి 10 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. రుణ కాల పరిమితి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి వడ్డీ రేటు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు మీకోసం. గూగుల్ పే నుంచి రుణం తీసుకుంటే 10.50% నుంచి 15 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్. ఇటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. రుణ గ్రహీత వయసు 21 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. క్రమం తప్పకుండా ఆదాయ వనరు ఉండటం ముఖ్యం. నీ బ్యాంకు ఖాతా నుంచి ప్రతినెలా ఈఎంఐ కట్ అవుతుంది. ఈ రుణం పొందేందుకు ప్రత్యేకంగా ప్రక్రియను ఫాలో కావాల్సి ఉంటుంది. గూగుల్ పే యాప్ తెరిచి మనీ ట్యాబ్ కు వెళ్లాలి. లోన్స్ విభాగంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను చూడాలి. అందుబాటులో ఉన్న ఆఫర్ పై క్లిక్ చేసి వారి చెప్పే సూచనలను ఫాలో కావాలి.

ఆ తరువాత కేవైసీ పత్రాలను అప్లోడ్ చేసి రుణ ఒప్పందాలను ఈ సైన్ చేయాలి. రుణం ఆమోదించబడిన తర్వాత ఆ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రుణం పొందిన తర్వాత నెలవారి ఈఎంఐ మీ గూగుల్ పే ద్వారా లింకు చేయబడిన బ్యాంకు ఖాతా నుండి నేరుగా కట్ అవుతుంది. ప్రతి నెల వారు చెప్పిన తేదీ తగిన బ్యాలెన్స్ ఉంచడం ముఖ్యం లేదంటే జరిమానా పడుతుంది. గూగుల్ పే సంస్థ రుణాలు అందించేందుకు ముందుకు రావడంతో ఎంతోమంది వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది రుణాల కోసం దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మందికి రుణాలను గూగుల్ పే సంస్థ అందించింది. వినియోగదారులు కూడా ఈ విధానం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ప్రక్రియ కూడా వేగంగా పూర్తి కావడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం పలు బ్యాంకులతో గూగుల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. గూగుల్ వినియోగదారులకు రుణాలను అందించడంలో భాగంగానే ఈ ప్రక్రియను చేపట్టింది. వినియోగదారులు కూడా ఈ రుణ సౌలభ్యం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేమెంట్స్ యాప్ ఈ సదుపాయాన్ని కల్పించడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి మీరు గూగుల్ పే వినియోగదారులు అయితే మీ ఆర్థిక అవసరాలకు అనుగుణమైన మొత్తాన్ని రుణం ద్వారా పొందండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్