అలర్ట్.. రేపు మద్యం షాపులు, మాంసం దుకాణాలు బంద్

మద్యం ప్రియులకు, మాంసం తినే వారికి చేదు వార్త. రేపు (జనవరి 26) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వైన్ షాపులు, చికెన్, మటన్ షాపులు బంద్ కానున్నాయి.

wine shops

ప్రతీకాత్మక చిత్రం

మద్యం ప్రియులకు, మాంసం తినే వారికి చేదు వార్త. రేపు (జనవరి 26) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వైన్ షాపులు, చికెన్, మటన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అన్ని వైన్ షాప్స్, మాంసం దుకాణాలు బంద్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ రోజు రాత్రి నుంచే ఎలాంటి జంతువులను వధించరాదని.. అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అటు ఏపీలోనూ మద్యం, మాంసం షాపులన్నీ క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ సిటీలో ఎక్కడా మాంసం సంబంధిత ఉత్పత్తులు కనిపించరాదని, అమ్మినట్లు తేలితే చర్యలు తప్పవని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తేల్చిచెప్పారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్