ఏపీలో రెండు దఫాలుగా మద్యం పాలసీ.. కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని పొందించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విధానాన్ని మారుస్తామని గతంలోనే కూటమి నాయకులు ప్రకటించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ దిశగా కసరత్తు ప్రక్రియ ప్రారంభమైంది.

liquor

 మద్యం 

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని పొందించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విధానాన్ని మారుస్తామని గతంలోనే కూటమి నాయకులు ప్రకటించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ దిశగా కసరత్తు ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా నూతన మద్యం విధానానికి సంబంధించి కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసి రెండు దఫాలుగా మద్యం పాలసీని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాలు పర్యాటక ప్రాంతాల్లో ఆ శాఖ నిర్వహించే షాపులు కలిపి మొత్తం 3,396 దుకాణాలు ఉన్నాయి. తొలుత వాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తరువాత గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్ అమలులో భాగంగా మరో 400 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్లో తొలి నోటిఫికేషన్ ఇచ్చి 3,396 షాపులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో ప్రైవేటు దుకాణాలు అనే పదాన్ని తొలగించి కేవలం ప్రభుత్వ మద్యం షాపులే ఉంటాయని సవరించింది.

దీంతో ఇప్పుడు ప్రైవేట్ షాపులు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు తొలుత ఎక్సైజ్ చట్టాన్ని మళ్లీ సవరించాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉంది. బుధవారం జరగనున్న క్యాబినెట్ భేటీలో మద్యం పాలసీని ఆమోదించిన తర్వాత దానిపై జీవో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఆర్డినెన్స్ తీసుకువచ్చి పాలసీని ప్రకటిస్తారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్టోబర్ మొదటివారం దాకా ప్రభుత్వ దుకాణాలే కొనసాగనున్నాయి. అక్టోబర్ 5-7 తేదీల మధ్య కొత్త దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతాల్లోని మద్యం షాపులను ఆ శాఖే నిర్వహిస్తోంది. ఇకపై ఆ షాపులను కూడా ప్రైవేటుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ప్రక్రియను కూడా ఆన్లైన్లోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దరఖాస్తు రుసుము రెండు లక్షలుగా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన మధ్య విధానం వచ్చే నెలలోనే అమలులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్