ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు లైట్ డిటెక్టర్ పరీక్షలు.. కీలక అంశాలు వెల్లడి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా లో గల ఆర్జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఘోష్ కు సిబిఐ అధికారులు లై - డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఘోష్ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. అత్యాచార ఘటన జరిగిన రోజు అంటే ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 20 గంటల సమయంలో విషయం తెలిసినట్లు ఘోష్ ఈ పరీక్షలో వెల్లడించాడు.

Sandeep Ghosh.

సందీప్ ఘోష్

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా లో గల ఆర్జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఘోష్ కు సిబిఐ అధికారులు లై - డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఘోష్ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. అత్యాచార ఘటన జరిగిన రోజు అంటే ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 20 గంటల సమయంలో విషయం తెలిసినట్లు ఘోష్ ఈ పరీక్షలో వెల్లడించాడు. హాస్పిటల్లోని ప్రొఫెసర్ సుమిత్ రాయ్ తపదర్ తనకు ఉదయం 10 గంటలకు ఫోన్ చేశాడని, ఆ సమయంలో స్నానం చేస్తుండడంతో మాట్లాడలేకపోయినట్లు సందీప్ వెల్లడించాడు. మిస్డ్ కాల్ ఉండడంతో 10 20 గంటల సమయంలో తిరిగి అతనికి కాల్ చేస్తే ఈ విషయం గురించి చెప్పినట్లు వివరించాడు. ఘటనా స్థలంలో ఏ వస్తువులను ముట్టుకోవద్దని, ఎవరిని లోపలికి అనుమతించవద్దని వారికి చెప్పినట్లు తెలిపాడు. ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి తాను చేరుకున్నట్లు వెల్లడించిన సందీప్ ఘోష్.. అప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు.

మృతురాలి తల్లిదండ్రులకు ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి వర్గాలు ఎందుకు చెప్పాయి అన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు. ఎవరు ఆ విధంగా చెప్పించారు అనే కోణంలో సిబిఐ దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తాము ఘటన స్థలానికి చేరుకున్న సమయానికి ఘోష్ ఎందుకు రాలేదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించగా.. అసత్యం, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను వెళ్లేసరికే వైద్యురాలు చెడిపోయిందని అతడు చెప్పినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు, ఘటన చోటు చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్ కు సిబిఐ కార్యాలయంలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నాయి. నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మరి కొంతమందికి కూడా ఈ టెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నాయి. వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆర్జీ కర్ వైద్య కళాశాల ఎదుట జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ సివిల్ వాలంటీర్ మద్యం మత్తులో నిరసన ప్రదేశంలోకి బైక్ తో వేగంగా దూసుకు వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. కోల్ కతా పోలీస్ స్టిక్కర్ ఉన్న బండిపై వేగంగా వచ్చి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టాడని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్