సుప్రీంకోర్టుకు లడ్డూ వివాదం.. సమగ్ర విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించిన బిజెపి, వైసిపి నేతలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డుపై వివాదం చెలరేగుతుంది. లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించగా.. దీనిపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూలో ఫ్యాట్ కలిసిందంటూ జరుగుతున్న ప్రచారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ బిజెపి, వైసీపీకి చెందిన నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బిజెపికి చెందిన ముఖ్య నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

YV Subbareddy, BJP leader Subrahmanyaswamy

వైవి సుబ్బారెడ్డి, బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డుపై వివాదం చెలరేగుతుంది. లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించగా.. దీనిపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూలో ఫ్యాట్ కలిసిందంటూ జరుగుతున్న ప్రచారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ బిజెపి, వైసీపీకి చెందిన నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బిజెపికి చెందిన ముఖ్య నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. లేదంటే నిపుణులతో విచారణ చేయాలని కోరారు. ఇదే వ్యవహారంపై మరో పిటిషన్ దాఖలు చేసిన బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి.. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని కోరారు. ఎటువంటి ఆధారాలు చూపించకుండానే సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సుబ్రమణ్య స్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విషయాన్ని సుబ్రహ్మణ్యస్వామి ఎక్స్ వేదికగా తెలియజేశారు. తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నిరాదార ఆరోపణలు చేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు కలుషితమైందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని, అందుకే ఈ వివాదం పై దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరారు. ఇప్పటికే తిరుమల లడ్డు వివాదంపై సురేష్ కండే రావు అనే వ్యక్తి కూడా పిటిషన్ వేశారు. తిరుమల లడ్డూ వివాదంపై మూడు పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వివాదంపై సీబీఐ లేదా మరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థతో అయినా దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. బిజెపికి చెందిన ముఖ్య నేత సుబ్రహ్మణ్యస్వామి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవైపు బిజెపి నాయకులు జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం.. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.  ఆధారాలు లేకుండా వ్యాఖ్యానించడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అనే రీతిలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సుబ్రమణ్య స్వామి వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపి నాయకులు ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. ఇదిలా ఉంటే తిరుపతి లడ్డు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరుకోవడంతో దీనిపై కీలక నిర్ణయం దిశగా అడుగులు పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్