బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడుపై కేసుల కత్తి వేలాడుతోంది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్.. బాలినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే రీతిలో రాజకీయం నడుస్తోంది. వైసిపి అధికారంలో ఉండగా దామచర్ల జనార్ధన్, ఆయన అనుయాయలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనేక కేసులతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇబ్బందులు పెట్టారని ఆయన వర్గీయులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దెబ్బకు దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో దామచర్ల, ఆయన బృందం ఉంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల కిందట షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరిపోయారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన వ్యవహార శైలి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ, ఆయన వైసీపీలోనే ఉండి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ ఓటమిని ఆయన చాలా రోజుల వరకు తీసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఈవీఎంలపై అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును కూడా ఆశ్రయించారు. ఒకవైపు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకే పార్టీని వీడినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడడం వెనుక బలమైన కారణం మరొకటి ఉందని చెబుతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడుపై కేసుల కత్తి వేలాడుతోంది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్.. బాలినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే రీతిలో రాజకీయం నడుస్తోంది. వైసిపి అధికారంలో ఉండగా దామచర్ల జనార్ధన్, ఆయన అనుయాయలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనేక కేసులతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇబ్బందులు పెట్టారని ఆయన వర్గీయులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దెబ్బకు దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో దామచర్ల, ఆయన బృందం ఉంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరడంతో ఒకింత దామచర్ల తీవ్రంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కేసుల ఉచ్చు తప్పించుకునేందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కేసుల భయంతో ఆయన జనసేనలో చేరినప్పటికీ విడిచి పెట్టేది లేదని దామచర్ల స్పష్టం చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు చేసిన అవినీతి అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అవినీతి చేసి ఇప్పుడు పార్టీ మారి తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దామచర్ల. బాలినేని ఎన్ని పార్టీలు మారినా అవినీతిపై చర్యలు తీసుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దామచర్ల చేసిన వ్యాఖ్యలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కేసుల భయం తనకు లేదని,
ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకానీ, ఈ తరహా రెచ్చగొట్టే మాటలు సరికాదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒంగోలు నియోజకవర్గంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు మధ్య కూడా పరిస్థితి ధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇరువురు నేతలతో కొద్దిరోజుల కిందట స్థానిక జనసేన నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి శ్రీనివాస్ రెడ్డితో కలిసి దామచర్ల జనార్దన్ ఫోటో పెట్టారంటూ పలువురు టిడిపి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. బాలనేని శ్రీనివాస్ రెడ్డి జనసేన లో చేరికతో రేగిన వివాదం ఎంతవరకు వెళుతుందో అన్న చర్చ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు స్వయానా బంధువు. మరో బంధువు తన బాబా వైవి సుబ్బారెడ్డితో పొసగకే ఆయన వైసీపీని వేడినట్టు ఆ పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. బాలినేని పార్టీని వీడడం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. 'యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడంటూ' జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానంతో కూడిన వీడియో పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.