నేడు అలుగునూర్ లో బీఆర్ఎస్ దీక్ష దివాస్.. పాల్గొననున్న కేటీఆర్

తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న దీక్ష దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కెసిఆర్ అరెస్ట్ అయిన అల్గనూరు వద్ద భారతీయ రాష్ట్ర సమితి శ్రేణులు దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా అన్ని జిల్లాలో శుక్రవారం దీక్ష దివస్ కార్యక్రమాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు.. దీక్ష దివస్ లో భాగంగా మరిన్ని విమర్శలను తీవ్ర స్థాయిలో చేసే అవకాశం ఉంది.

Inaugurating KCR (File Photo)

దీక్ష చేసిన కెసిఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సాధించాలన్న బలమైన ఆకాంక్షతో కెసిఆర్ దీక్షకు దిగిన నవంబర్ 29వ తేదీన భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా దీక్ష దివస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీక్షా దివస్ ను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఇన్చార్జిలను కూడా అగ్రనేత నిర్మించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న దీక్ష దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కెసిఆర్ అరెస్ట్ అయిన అల్గనూరు వద్ద భారతీయ రాష్ట్ర సమితి శ్రేణులు దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా అన్ని జిల్లాలో శుక్రవారం దీక్ష దివస్ కార్యక్రమాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు.. దీక్ష దివస్ లో భాగంగా మరిన్ని విమర్శలను తీవ్ర స్థాయిలో చేసే అవకాశం ఉంది. అలుగునూర్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుమారు పదివేల మంది పాల్గొనేల ఏర్పాటు చేశారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే ఈ దివస్ కార్యక్రమం జరగనున్న ప్రాంతమంతా గులాబీ జెండాలతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభము కానున్న ఈ దీక్ష దివస్ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు ముగియనుంది. కేటీఆర్ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక్కడ జరగనున్న సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ఎటువంటి విమర్శలు చేస్తారన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. 

ఈ సభలో పాల్గొనే ముఖ్యనేతలంతా తెలంగాణ ఆవిర్భవానికి సంబంధించి కెసిఆర్ సహా బీఆర్ఎస్ సహా పార్టీ నాయకులు, తెలంగాణ వాదులు సాగించిన పోరాటాన్ని గురించి ప్రసంగించే అవకాశం ఉంది. తెలంగాణ ఎలా ఏర్పాటు కాదో చూస్తానంటూ 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టారు. సిద్దిపేట రంగ ధాంపల్లి వద్ద దీక్ష వేదిక ఏర్పాటు అయింది. నవంబర్ 28న తెలంగాణ తల్లికి హైదరాబాదులో పూలమాల వేసిన కేసిఆర్ ఆ తరువాత కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు చుట్టుముట్టారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు కేటీఆర్ వంటి వారు ఆమరణ దీక్షలకు దిగారు. ఇంకోవైపు అటు సిద్దిపేట రంగధాంపల్లి సభాస్థలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ తరువాత ఖమ్మం వేదికగా జరిగిన హైడ్రామాలు తెలంగాణలోని భావోద్వేగ రాజకీయాలను ఎప్పటికప్పుడు తెరపైకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ 29న దీక్షా దివస్ కు ప్రాధాన్యత ఏర్పడింది. నాటి కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే బిఆర్ఎస్ పార్టీ తాజాగా దీక్ష దివస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం కోసం కేసీఆర్ సాగించిన పోరాటాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ వేదికగా చేసుకుంటుంది. తాజాగా కేటీఆర్ పాల్గొంటున్న సభలో ఎటువంటి విమర్శలను ప్రభుత్వంపై చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్