అమృత్ టెండర్లలో అవకతవకలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. రేవంత్ రెడ్డి కుటుంబీకుల అవినీతి అంటూ వ్యాఖ్య

అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబీకుల లక్ష్యంగా ఆయన ఈ ఆరోపణలను గుప్పించారు. సిఎం రేవంత్ రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యానించారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు ఆయన లేఖలను శుక్రవారం రాశారు.

BRS Working President KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబీకుల లక్ష్యంగా ఆయన ఈ ఆరోపణలను గుప్పించారు. సిఎం రేవంత్ రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యానించారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు ఆయన లేఖలను శుక్రవారం రాశారు. ఈ లేఖలను తాజాగా  ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ అర్హత లేకుండా దొడ్డిదారిన రూ.1137 కోట్ల పనులు దక్కించుకున్న పత్రాలను ఆయన బహిర్గతం చేశారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకుందని రేవంత్ రెడ్డి కుటుంబంపై కేటీఆర్ ఆరోపించారు. ఆ తరువాత అదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అని పేర్కొన్నారు. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పజెప్తోందని ఆరోపించారు.

ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బయటకు చెప్పే మాటలు ఒకటని, చేసే పనులు మరొకటంటూ పేర్కొన్నారు. అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్లపైన పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా రాష్ట్రంలోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి టెండర్పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయా టెండర్ల వ్యవహారంపై సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్ రద్దు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ట్విట్టర్లో పెట్టిన ఈ టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపైన పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని, ఈ తరహా అడ్డగోలు విమర్శలతో కాలం గడిపేస్తున్నారు అంటూ పలువురు సీనియర్ నాయకులు విమర్శించారు. అధికారం లేకుండా బిఆర్ఎస్ నాయకులు ఉండలేకపోతున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్