తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి.. మేఘ కృష్ణారెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చేయడానికి దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. దమ్ముందా మేఘ కృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి అంటూ నిలదీశారు.
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి.. మేఘ కృష్ణారెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చేయడానికి దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. దమ్ముందా మేఘ కృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి అంటూ నిలదీశారు. దమ్ముందా ఆ ఆంధ్ర కాంట్రాక్టర్ ను తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి తీసేయడానికి అంటూ ప్రశ్నించారు కేటీఆర్. సీఎం అయ్యుండి మేఘాకు గులాం గిరి చేస్తున్నావా.? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
అరెస్టులను తీవ్రంగా ఖండించిన కేటీఆర్..
సీఎం రేవంత్ రెడ్డి మూసి పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల శాసన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు పేరుతో నిర్బంధానికి గురి చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కును ఈ ప్రభుత్వం కాల రాస్తూ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్. నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డిలను, నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.