సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం.. అదాని వంద కోట్లు వెనక్కి ఇవ్వడంపై సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు విసిరారు. రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఆదాని ఇచ్చిన 100 కోట్లు తిరస్కరించాడని విమర్శించారు.

Brs Working President KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు విసిరారు. రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఆదాని ఇచ్చిన 100 కోట్లు తిరస్కరించాడని విమర్శించారు. కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదని, రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏమిటని.? కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలలో ఎవరు పిచ్చోళ్లో వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్ట్ ను అదా నీ డేటా సెంటర్ అని రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అనుముల రేవంత్ రెడ్డి కాదని, అబద్ధాల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తాను రేవంత్ రెడ్డి కంటే చిన్నవాడినని, తిట్టినా పడతానన్నారు. కెసిఆర్ ను అనడానికి రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. ఈడీ కేను కోసం రేవంత్ రెడ్డి, అతని మంత్రులు లెక్క తాము అదాని కాళ్లు పట్టుకోలేదని ఆరోపించారు. 

బ్యాగులు మోసిన గజదొంగ రేవంత్ రెడ్డి అని, చిట్టి నాయుడుకి చిప్ దొబ్బిందని, ఈ విషయం నిన్నటి రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తే అర్థమవుతుందన్నారు. తాను సైకో అయితే రేవంత్ రెడ్డి సన్నాసినా.? శాడిష్ట.? అని ప్రశ్నించారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయల కూడా తీసుకురాలేదని, 28 సార్లు ఢిల్లీ యాత్ర చేశారని విమర్శించారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి 28 రూపాయల కూడా తీసుకురాలేదన్నారు. అదా నీ జాతీయ రహదారులు, రక్షణ శాఖ పనులు చేస్తే తమకేం సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిలో సబ్జెక్టు, సరుకు ఉండదని, ఎవరైనా చెప్తే వినడని ఆరోపించారు. దావోస్ లో తాను అదానిని బరాబర్ కలిసినా అన్న కేటీఆర్.. మీ మాదిరిగా కోహినూరులో కాళ్లు పట్టుకోలేదని విమర్శించారు.

కెసిఆర్ హయాంలో అదా నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదని, అదా నీకు రేవంత్ రెడ్డి కార్పెట్ వేస్తే, తాము రెడ్ సిగ్నల్ చూపించామని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కెసిఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సోదరులు చేసిన హత్యగా ఈ సందర్భంగా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డిలో అసహనం, నిరాశ, నిస్పృహ పెరుగుతున్నాయని, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ కు కేసిఆర్, తమపై ఫ్రస్టేషన్ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, వాంకిడి గురుకుల విద్యార్థి సైలజది ప్రభుత్వం చేసిన హత్యగా ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. తల్లిదండ్రులు మాదిరిగా చూసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో విద్యార్థులు మృత్యువాత చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు పోషకాహారం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్