తెలంగాణ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ఫై ప్రివిలైజ్ మోషన్

కాంగ్రెస్ పార్టీపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Brs Working President ktr

భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

కాంగ్రెస్ పార్టీపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర అప్పులు ఏడు లక్షల కోట్లంటూ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాము ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆర్బిఐ నివేదిక ప్రకారం అప్పు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఏడు లక్షల కోట్లు అంటూ ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తమని స్పష్టం చేశారు. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ ఈ మేరకు నివేదిక తేల్చిందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో బి.ఆర్.ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని విమర్శించారు. కాబట్టి తెలంగాణ శాసనసభ కార్య విధానం, కార్యక్రమ నిర్వహణ నియమాలలో 168 (1) నిబంధన ప్రకారం టిఆర్ఎస్ శాసనసభాపక్షం తరఫున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు, సభాకుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. 

కెసిఆర్ ఆనవాళ్లను చెరిపేయడం సాధ్యం కాదు..

పదేళ్లపాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదని, ఆయన నిర్మించిన ఇళ్ళకు సున్నాలు వేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్లని ప్రజల కళ్లకు గంతలు కట్టలేవన్నారు. గోస పడ్డ ప్రతి గుండెకు తెలుసని, ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేసీఆర్ కల అని పేర్కొన్నారు. ఎన్నాళ్లున్నా ఆ నిర్మాణాలకు మీరు కేవలం పెయింటర్లు మాత్రమేనని, ఎప్పటికీ మీరంతా సున్నాల వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమే ఘాటుగా విమర్శించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్