బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఆదివారం స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ' అతి తెలివి మంత్రిగారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టిడిపిలోనే ఉన్నాడా..? లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా.?' అని కేటీఆర్ ప్రశ్నించారు. ' సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం. మరి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ తిరిగిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు' అంటూ ఘాటుగానే కేటీఆర్ ప్రశ్నించారు.
కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఆదివారం స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ' అతి తెలివి మంత్రిగారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టిడిపిలోనే ఉన్నాడా..? లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా.?' అని కేటీఆర్ ప్రశ్నించారు. ' సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం. మరి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ తిరిగిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు' అంటూ ఘాటుగానే కేటీఆర్ ప్రశ్నించారు. సిగ్గు లేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్. అసలు పార్టీలో చేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ' మీరు ప్రలోభ పెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు' అని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అబద్దాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్న చూపు చూస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ జీతాలు చెల్లిస్తామని చెప్పారని, జీతాలు సమయానికి ఇవ్వకపోతే కుటుంబాలు గడిచేది ఎట్లా అని ఈ సందర్భంగా నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. శాంతి, భద్రతలను కాపాడలేని అసమర్ధ, చేతకాని సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డినే తాము ఎదుర్కొన్నామని, వారితో పోలిస్తే నువ్వు చాలా చిన్నోడివి అంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నువ్వు చిట్టి నాయుడు, బుల్లి అబ్బాయి వంటి వాడివని, పదవి ఎవరికి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులను వదిలిపెట్టబోమని, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఒక్క ప్రాంతీయ విద్వేష ఘటన చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్ ప్రజలు తమను కడుపునిండా ఆశీర్వదించారన్నారు.