రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భారతీయ రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కని గుడి లేదని, మొక్కని దేవుడు లేడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం దక్కించుకునేందుకు చేయని శపథం లేదని, ఆడని అబద్దం లేదన్నారు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యమని వ్యాఖ్యానించారు. చట్ట సభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆరోపించారు.
కేటీఆర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భారతీయ రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కని గుడి లేదని, మొక్కని దేవుడు లేడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం దక్కించుకునేందుకు చేయని శపథం లేదని, ఆడని అబద్దం లేదన్నారు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యమని వ్యాఖ్యానించారు. చట్ట సభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆరోపించారు. అధికారం కోసం అందరికి రుణమాఫీ అని హామీ ఇచ్చారని, అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ చేసిందన్నారు.
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి తయారయిందన్నారు. పెట్టెలో ఓట్లు పడ్డాయని, జేబులో నోట్లు పడ్డాయన్నారు. ఢిల్లీకి మూటలు ముట్టాయని, ఇక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తే ఎంత, గంగలో కలిస్తే ఎంత అన్నట్లు కాంగ్రెస్ యవ్వారం ఉందన్నారు. రెండు లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారని, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. నాడు రెండు లక్షలు దాటినా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఇప్పుడేమో రెండు లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారని పేర్కొన్నారు. నాడు ఓట్ల కోసం హామీలు ఇచ్చారని, నేడు ఎగవేత కోసం కొర్రీలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మిస్టర్ రాహుల్, మాఫీమాంగో తెలంగాణసే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ విమర్శించారు.