కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్.. డ్రామా ఎవరిది అంటూ ప్రశ్న

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కొట్టాలకు భయపడేవారు ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన స్పందించారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు.

 Brs working president Ktr

భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కొట్టాలకు భయపడేవారు ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన స్పందించారు. ఎవనిదిరా కుట్ర?  ఏంది ఆ కుట్ర? అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అని ప్రశ్నించిన కేటీఆర్.. గడిచిన తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అంటూ నిలదీశారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర అంటూ కేటీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుందంటూ ఎద్దేవా చేశారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసన్న కేటీఆర్.. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని స్పష్టం చేశారు. నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరని, చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి అంటూ సవాల్ చేశారు. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లా కలెక్టర్ తోపాటు ఇతరులపై జరిగిన దాడి కేసు ప్రస్తుతం రాజకీయంగా దుమారం సృష్టిస్తోంది. ఈ కేసులో సహకరించారని కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో గంటల వ్యవధిలోనే భారీగా కార్యకర్తలు హైదరాబాదులోని నంది నగర్ కు చేరుకున్నారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తారని ప్రచారంతో శ్రేణులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అరెస్టును అడ్డుకుంటామంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. అర్ధరాత్రి తన ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలను కేటీఆర్ పలుకరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తనపై అభిమానంతో వచ్చిన కార్యకర్తలందరికీ పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటికి వెళ్లి పోవాలంటూ కేటీఆర్ చెప్పిన కార్యకర్తలు అక్కడి నుంచి మాత్రం కదల్లేదు. ఇప్పటికీ వందలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్