అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 25% రాయితీ కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగర పరిధిలోని జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రాల ద్వారా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సహాయాన్ని అందిస్తోంది. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా.? లేదా.? అని అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 25% రాయితీ కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగర పరిధిలోని జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రాల ద్వారా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సహాయాన్ని అందిస్తోంది. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా.? లేదా.? అని అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు అధికారులు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదిస్తున్నామని, కార్యాలయాలకు వచ్చి రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించాలని అధికారులు దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు. మార్చి 31 లోపు అనుమతి లేని లేఅవుట్ల ప్లాట్లు క్రమబద్ధీకరణ కోసం నగదు చెల్లించే వారికి తెలంగాణ ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసి కమిషనర్ దరఖాస్తుదారుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సంబంధిత జోనల్ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తుదారులు హెల్ప్ డెస్క్లను సంప్రదించాలని కమిషనర్ ఒక ప్రకటనలో ఇప్పటికే పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తొలిసారి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిహెచ్ఎంసి పరిధిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ వేరువేరు దశల్లో పెండింగ్ లో ఉన్నాయి. అర్హమైన దరఖాస్తులకు ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రయోజనం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమ లే అవుట్లపై తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. మార్చి 31వ తేదీ లోపు క్రమబద్ధీకరణ చేసుకున్న వారికి 25% రాయితీ ప్రకటించింది. నేరుగా రిజిస్టర్ ఆఫీస్ లోనే ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. జిహెచ్ఎంసి జోనల్ ఆఫీసుల్లో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు నగర పరిధిలోని వివిధ జోన్లు వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే.. చార్మినార్ - 15,292, ఎల్బీనగర్ 40,383, ఖైరతాబాద్ 5,773, కూకట్పల్లి 22,901, శేరిలింగంపల్లి - 18,721, సికింద్రాబాద్ 4,795 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 1,07,865 దరఖాస్తులు వచ్చాయి.