తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతోంది. కానీ, ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. గడిచిన కొన్నాళ్లుగా ఎంతో మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వేలాది మంది అర్హులు కొత్త రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించి అనేక ప్రకటనలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. దీంతో అర్హులైన ఎంతో మంది తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు.
రేషన్ కార్డులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతోంది. కానీ, ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. గడిచిన కొన్నాళ్లుగా ఎంతో మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వేలాది మంది అర్హులు కొత్త రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించి అనేక ప్రకటనలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. దీంతో అర్హులైన ఎంతో మంది తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. వీరికి శుభవార్తను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించింది. రేషన్ కార్డులు జారీపై క్లారిటీని ఇచ్చింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కార్డులు అందేంత వరకు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డులతోపాటు పాత కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యులు పేర్లు చేర్చే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. మొదట కుల గణన జాబితాలో ఉండి అర్హులైన వారికి ఇస్తున్నామని వెల్లడించారు. కుల గణన జాబితాలో పేర్లు లేని వాళ్లు, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పాత రేషన్ కార్డులు కొనసాగుతాయని, ప్రజలు అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఆందోళనలు అవసరం లేదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించే వరకు ప్రక్రియ కొనసాగుతందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తాజా ప్రకటనతో రాష్ట్రంలోని అర్హులైన వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు మంజూరులో చిక్కులు లేకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని కోరుతున్నారు. రేషన్ కార్డులు పంపిణీపై తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను కొద్దిరోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. అర్హులైన ఫరపతి