అన్నదాతలకు రైతు భరోసా పథకంతో పాటు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే ఈ పథకానికి సంబంధించిన కీలకమైన నిబంధనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని రైతులందరికీ భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నిధులు విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వ్యవసాయం చేసే రైతులందరికీ ఈ పథకంలో భాగంగా సాయాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
ప్రతికాత్మక చిత్రం
అన్నదాతలకు రైతు భరోసా పథకంతో పాటు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే ఈ పథకానికి సంబంధించిన కీలకమైన నిబంధనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని రైతులందరికీ భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నిధులు విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వ్యవసాయం చేసే రైతులందరికీ ఈ పథకంలో భాగంగా సాయాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వ్యవసాయ భూమి ఉంటే మాత్రమే ఈ సాయం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ సీజన్లో పంట వేయకుంటే భరోసా నిధులు రావని విమర్శలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. రైతు భరోసా కింద ఇచ్చే సాయాన్ని తెలంగాణలోని 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి వర్తించేలా పథకాన్ని రూపొందిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 64 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు 12 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గ్రామసభలతోనే ఎంపిక చేయనున్నారు. ఈనెల 20 వరకు అర్హుల ఎంపిక జరగనుంది.
ఈనెల 26 నుంచి రైతుల అకౌంట్లో భరోసానిధులు జమ కానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భూములేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల ఆత్మీయ భరోసా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూములు లేని రైతులకు అందించేందుకు రూ.700 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా దేనికి వర్తిస్తుంది. దేనికి వర్తించదు అన్నదానిపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మైనింగ్, కొండలు, గుట్టలున్న భూమికి, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య భూములు, నాలా కన్వర్టేడ్ భూములు, ప్రభుత్వం సహకరించిన భూములకు వర్తించదని తేల్చి చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు భరోసా సాయం ఎవరికి వర్తిస్తుంది అనేదానిపైన ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి ఉన్న రైతులకు, అందులో సాగు చేస్తున్న వారికి ఈ పథకంలో భాగంగా సాయం అందనుంది. అలాగే సాగు చేసే భూములే కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా అందుతుంది. అంటే ఆయా సీజన్లో పంట వేయకుండా సాగులో భూమి ఉంటే సరిపోతుంది. రైతు భరోసా కు సంబంధించి రెండు మూడు రోజుల్లోనే పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తుందని చెబుతున్నారు. ఇది విధానాల ఖరారు చేయడంపై ఇప్పటికే అధికారులు పనిచేస్తున్నారు.