ఆసుపత్రులపై దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

దేశ వ్యాప్తంగా ఆసుపత్రులపై దాడులు పెరుగుతున్నాయి. రోగి చనిపోయినప్పుడు బంధువులు ఆ బాధను తట్టుకోలేక అనేక సందర్భాల్లో ఆసుపత్రులపై దాడులు చేసిన వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొన్నిసార్లు ఆసుపత్రి సిబ్బంది పైన కూడా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఆసుపత్రి పై పలువురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశ వ్యాప్తంగా ఆసుపత్రులపై దాడులు పెరుగుతున్నాయి. రోగి చనిపోయినప్పుడు బంధువులు ఆ బాధను తట్టుకోలేక అనేక సందర్భాల్లో ఆసుపత్రులపై దాడులు చేసిన వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొన్నిసార్లు ఆసుపత్రి సిబ్బంది పైన కూడా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఆసుపత్రి పై పలువురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జోరుగా విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఫిర్యాదు చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు శుక్రవారం కీలక ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆసుపత్రి ప్రాంగణం లేదా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని ఆదేశించింది. నిర్ణీత కడుపులోగా ఫిర్యాదు అందకపోతే సంబంధిత ఆసుపత్రి హెడ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ ఆదేశాల నేపథ్యంలో ఆసుపత్రులపై దాడులను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా దాడులు పెరిగితే వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చే వైద్యుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ సర్వత్ర వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆర్ జి కర్ హాస్పిటల్ లో జరిగిన హత్యాచార ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ నేపథ్యంలోనే దుండగులు ఆసుపత్రి పై దాడుకు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగాను ప్రస్తుతం విచారణ సాగుతోంది. దానికి ఎవరు పాల్పడ్డారు అన్న విషయాలు బహిర్గతమైతే.. హత్యాచార ఘటన కేసు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్