రెడ్‌ బుక్‌పై మంత్రి లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు.. పని ప్రారంభమైందంటూ స్పష్టీకరణ

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సాయంత్రం శ్రీకాకుళంలోని ఒక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్‌ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో చూశారని, మనం ఏ మతానికి చెందిన వారమైనప్పటికీ అన్ని మతాలను గౌరవించాలని స్పష్టం చేశారు. మేము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామన్న నారా లోకేష్‌.. తిరుమలకు వెళ్తానంటున్న జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుదని సూచించారు.

Minister Lokesh

మంత్రి నారా లోకేష్‌

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సాయంత్రం శ్రీకాకుళంలోని ఒక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్‌ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో చూశారని, మనం ఏ మతానికి చెందిన వారమైనప్పటికీ అన్ని మతాలను గౌరవించాలని స్పష్టం చేశారు. మేము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామన్న నారా లోకేష్‌.. తిరుమలకు వెళ్తానంటున్న జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుదని సూచించారు. తిరుమల లడ్డూ నాణ్యత లోపంతోపాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తనకు తెలియజేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీని ప్రక్షాళన చేయాలనీ ఈవోకు చెప్పానని, నెయ్యి సరఫరా చేఏ కంపెనీ టర్నోవర్‌ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవీ సుబ్బారెడ్డి రూ.150 కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారని ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామన్న నారా లోకేష్‌.. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుపై నారా లోకేష్‌ స్పష్టత ఇచ్చారు. జగన్‌ మాదిరిగా తాము పారిపోయే వ్యక్తులం కాదని, ఇప్పటికే పింఛన్లు, మెగా డీఎస్సీ హామీలను అమలు చేశామన్నారు. జగన్‌ మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదన్న లోకేష్‌.. తప్పు చేయకపోతే ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవటీకరణ చేయబోమని కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్న లోకేష్‌.. విశాఖ స్టీల్‌ను బతికించేందుకు నిధులు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని కోరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పని ప్రారంభమైందన్న మంత్రి లోకేష్‌.. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్‌ అమలు ప్రారంభమైందని, చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఐపీఎస్‌లు కూడా సస్పెండ్‌ అయ్యారన్నారు. రైట్‌ ప్లేస్‌లో రైట్‌ పర్సన్‌ ఉండాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్