దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆర్.బి.ఐ కీలక నిర్ణయాలను తీసుకుంటూ వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్బిఐ మరో కీలక నిర్ణయానికి తీసుకుంది. జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ డబ్బులు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు అమల్లోకి వచ్చే పడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ వచ్చింది. దేశ వ్యాప్తంగా గణనీయంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. చిన్న చిన్న పనులకు కూడా డిజిటల్ చెల్లింపులను వినియోగిస్తున్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆర్.బి.ఐ కీలక నిర్ణయాలను తీసుకుంటూ వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్బిఐ మరో కీలక నిర్ణయానికి తీసుకుంది. జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ డబ్బులు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు అమల్లోకి వచ్చే పడుతుంది. కొత్త ఏడాది నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఆర్.బి.ఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్ ఈ నియమాలను తెలుసుకోవడం అత్యవసరం. యూపీఐ లావాదేవీల కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన కొత్త నియమాలు పరిశీలిస్తే.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం మార్పును చూపనున్నాయి.
యూపీఐ లావాదేవీ పరిమితులకు తీవ్రమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. జనవరి ఒకటి నుంచి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీ పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పార్వతి కేవలం రూ.5000 కాగా, ఇప్పుడు దానిని పదివేలకు పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త నిబంధనలను ప్రకటించినప్పటికీ.. బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలో పాటించడానికి, వినియోగదారులకు సేవలను అందించడానికి సమయం పట్టనుంది. ఈ వ్యవధి డిసెంబర్ 31 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. అలాగే మరికొన్ని నూతన నిబంధనలను కూడా ఆర్బీఐ జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ డబ్బులు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు కూడా అమలులోకి వస్తాయి. దీని ప్రకారం యూపీఐ 123 పే ద్వారా చేసే లావాదేవీలు కు ఎటువంటి సేవ చార్జి విధించరు. అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా ఏమి టెన్స్ సర్వీస్ కూడా అందించబోతోంది. అంటే పీచర్ ఫోన్ల ద్వారా ఐవిఆర్ నెంబర్ ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేయవచ్చు. ఇంటర్నెట్ సేవలతో మొబైల్ ఫోన్లను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. నూతన సేవలు వినియోగదారులకు మేలు చేకూరుస్తాయని పలువురు పేర్కొంటున్నారు.