శబరిమలలో కీలక మార్పులు.. 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం

అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించేలా కీలక నిర్ణయాన్ని ఆలయ అధికారులు తీసుకున్నారు. ఇప్పటివరకు ముందు పదునట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మీదుగా సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త లేఅవుట్ ను డిజైన్ చేశారు.

Sabarimala Ayyappa Temple

శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధి

అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించేలా కీలక నిర్ణయాన్ని ఆలయ అధికారులు తీసుకున్నారు. ఇప్పటివరకు ముందు పదునట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మీదుగా సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త లేఅవుట్ ను డిజైన్ చేశారు. దీని ప్రకారం సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని తొలగిస్తారు. వచ్చే నెల 18న మీన మాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఆ సీజన్లో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదా నాలుగు లైన్లను ఏర్పాటు చేస్తారు. భక్తులు బలికల్పుర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ఇప్పటివరకు ముందు ఫ్లై ఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతి ఇచ్చేవారు.

దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండు లేదా మూడు సెకండ్ల పాటు అయ్యప్ప దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాట, పోలీసులను లాగేయడం వల్ల మండల కాలం కఠిన దీక్షను పూర్తిచేసుకుని, అంత దూరం వెళ్లిన దర్శనం సరిగ్గా జరగలేదని బాధ భక్తుల్లో ఉండేది. తాజా నిర్ణయం వల్ల ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. స్వామివారిని దగ్గర్నుంచి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. కనిక్కవంచి నుంచి వెళ్లేటప్పుడు 30 సెకండ్ల నుంచి నిముషం వరకు అలా అయ్యప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం శబరిమలలో కుంభ మాస పూజలు జరుగుతున్నాయి. ఈనెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. 17వ తేదీ నుంచి పుట్టు ఓవర్ బ్రిడ్జి తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను చేపడుతారు. హైకోర్టు కూడా కొత్త ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్ ఆర్ జయకృష్ణన్, ట్రావెన్కోర్ బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత పర్యవేక్షణలో పనులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని భక్తుల రద్దీ నేపథ్యంలో 1989లో ఏర్పాటు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్