మోసానికి, నయ వంచనకు కాంగ్రెస్ పాలన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. మోసం నయ వంచనకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తుందని దుయ్యబట్టారు. కెసిఆర్ చెప్పినట్లే కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, సోనియా గాంధీ మాటగా రూ.15 వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్
మోసానికి, నయ వంచనకు కాంగ్రెస్ పాలన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. మోసం నయ వంచనకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తుందని దుయ్యబట్టారు. కెసిఆర్ చెప్పినట్లే కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, సోనియా గాంధీ మాటగా రూ.15 వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారని, ఆ ప్రకటన ఎప్పుడు అమలు చేస్తారని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 12 వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. దేశంలోనే కెసిఆర్ రైతుబంధుగా, రేవంత్ రెడ్డి రాబందుగా మిగిలిపోతారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒడ్డు దాటనంత వరకు ఓడ మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, చిన్న చూపు చూసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు హామీల విషయంలో రేవంత్ రెడ్డివి దివాలా కోరు మాటలని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మంత్రులు చెబుతున్నారని, బాగోలేనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి బాగోలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగాలేదని రైతులను, మహిళలను, ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో 1.38 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్పితే రైతులు గురించి పట్టించుకోవడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.5,493 కోట్ల రెవెన్యూ సర్ప్లెస్ ను కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని, ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి, డిఏలు ఎగ్గొట్టేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయని ఆరోపించారు. రైతుకు రూ.17,500 ఎకరాకు ఇచ్చేవరకు రేవంత్ ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూనే ప్రజాపక్షం ఉంటూ పోరాటాన్ని సాగిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పితే కలిగిన ప్రయోజనాలు లేవన్నారు. రైతులకు సంఘీభావంగా సోమవారం అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని డ్రామాలు ఆడుతోంది అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రైతుల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతాయని స్పష్టం చేశారు.