అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశాల్లో ఆయన అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ నెల 11న బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనున్న సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. గత బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై ఆ తరువాత మళ్లీ అడుగుపెట్టలేదు.
అసెంబ్లీలో మాట్లాడుతున్న కేసీఆర్(ఫైల్ ఫొటో)
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశాల్లో ఆయన అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ నెల 11న బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనున్న సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. గత బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై ఆ తరువాత మళ్లీ అడుగుపెట్టలేదు. ఈ నెల 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు మాత్రం హాజరుకావాలని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఆయన సమాచారాన్ని అందించినట్టు చెబుతున్నారు. ఒకవేళ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకపోతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే శాసనసభాపక్ష సమావేశం జరిగేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టే ఉద్ధేశంతోనే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా, నిర్ధేశం చేయనున్నారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టేందుకు ఆయన సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు.