గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. ముఖ్యంగా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఆ తరువాత కండువాలు మార్చేశారు. వీరుపై ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన వారిని డిస్క్ క్వాలిఫై చేయాలంటూ కోర్టులో పోరాడుతోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలపై కీలక నిర్ణయాలను తీసుకోవడంలో కెసిఆర్ వెనకబడి ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అయితే ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించి పార్టీ కార్యకర్తలను వేగవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి.
కెసిఆర్
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. ముఖ్యంగా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఆ తరువాత కండువాలు మార్చేశారు. వీరుపై ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన వారిని డిస్క్ క్వాలిఫై చేయాలంటూ కోర్టులో పోరాడుతోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలపై కీలక నిర్ణయాలను తీసుకోవడంలో కెసిఆర్ వెనకబడి ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అయితే ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించి పార్టీ కార్యకర్తలను వేగవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు కేసీఆర్ ఆలోచన చేయలేదు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జులు లేకపోవడం, గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో ఉండడంతో తమకున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్యకర్తలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు సీనియర్ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ కోసం పనిచేసే నేతలకు ఆయా నియోజకవర్గాలను అప్పగిస్తే మంచి ఫలితాలను భవిష్యత్తులో అక్కడ చూడవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇవి ఆ నియోజకవర్గాలు..
భారతీయ రాష్ట్ర సమితిలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు జాబితాలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లా వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఉన్నారు. వీరి స్థానాల్లో ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించాలని పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కోరుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే బలంగా పనిచేస్తున్నారు. అటువంటి వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేడర్ కోరుతోంది. మరి దీనిపై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య చురుగ్గా పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం లో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత తరచూ పర్యటనలు చేస్తూ అక్కడ కేడర్కు అందుబాటులో ఉంటుంది. పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వండని కార్పొరేటర్లు మరి కొంతమంది నేతలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి పూర్తిస్థాయిలో బాధ్యతలను అధికారికంగా అప్పగిస్తే మరింత మంచి ఫలితాలను రాబట్టేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులకు కోరుతున్నారు.