కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ.. తెలంగాణ హీటెక్కిన గ్రేటర్ పాలిటిక్స్

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Kaushik Reddy, Arikepudi Gandhi

కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిగ్గు ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలంటూ వ్యాఖ్యానించారు. లేకపోతే అందరికీ చీర, గాజులు పంపిస్తామని, వాటిని వేసుకుని తిరగాలని సూచించారు. గతంలో కెసిఆర్ ఎప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పలేదని, కప్పినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపైనా కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ చేశారు. లేకపోతే తానే గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఆయన ఇంటిపై ఎగరవేస్తానని స్పష్టం చేశారు.

ఈ సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ సవాల్ చేశారు. కెసిఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల తోనే అసలు సమస్య వస్తోందని మండిపడ్డారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తాను స్థానికుడిని కాదని చెప్పడానికి కౌశిక్ ఎవడని ఈ సందర్భంగా గాంధీ ప్రశ్నించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ అని, కౌశిక్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని కేసీఆర్ 10 ఏళ్లపాటు పక్కన పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వివాదం తీవ్రస్థాయికి చేరుతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద కూడా భారీగా మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పుట్టుకే ఫిరాయింపులతో మొదలైందని పలువురు మహిళా నేతలు విమర్శించారు. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్