కేన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి జూనియర్‌ ఎన్‌టీఆర్‌ వీడియో కాల్‌

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి ఎన్‌టీఆర్‌ వరకు చేరింది. వెంటనే స్పందించిన జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తన అభిమాని కౌశిక్‌తో మాట్లాడేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు తన అభిమానులు ద్వారా కౌశిక్‌ తల్లిదండ్రులను సంప్రదించి వీడియో కాల్‌లో కౌశిక్‌తో మాట్లాడారు. నువ్వు నవ్వితే బాగున్నావ్‌ అంటూ ఎన్‌టీఆర్‌ అనగానే కౌశిక్‌ ఎమేషనల్‌ అయ్యాడు. థాంక్యూ అంటూ ఎన్‌టీఆర్‌కు కౌశిక్‌ బదులు ఇచ్చాడు.

Junior NTR talking to a fan

అభిమానితో మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్

రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా నటులను పిచ్చిగా అభిమానించే వాళ్లు ఎందరో ఉన్నారు. ఎంతో మంది తమ అభిమాన నటులను దేవుళ్లగా కూడా కొలుస్తారు. చావు బతుకుల్లో ఉన్నా కూడా తమ అభిమాన నటులు కోసం పరితపిస్తుంటారు. అటువంటి అభిమానులు జూనియర్‌ ఎన్‌టీఆర్‌కు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిలో ఒక వ్యక్తి జూనియర్‌ ఎన్‌టీఆర్‌ను చిన్నప్పటి నుంచి ఎంతగానో అభిమానిస్తున్నాడు. తిరుపతికి చెందిన కౌశిక్‌(19)కు ఎన్‌టీఆర్‌ అంటే ఎంతో ఇష్టం. ఎన్‌టీఆర్‌ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా తొలిరోజు చూసేంత అభిమానం యువకుడిది. అయితే, దురదృష్టవశాత్తూ కౌశిక్‌ బ్లడ్‌ కేన్సర్‌ బారినపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కౌశిక్‌ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. చనిపోతున్నానన్న బాధ కూడా కౌశిక్‌కు లేదు. కానీ, తన అభిమాన హీరో ఎన్‌టీఆర్‌ దేవర సినిమాను చూసి చనిపోవాలని తల్లిదండ్రులకు చెప్పాడు. తన చివరి కోరిక ఇదే తీర్చండి అంటూ ప్రాదేయపడ్డాడు. ఈ విషయాన్ని కౌశిక్‌ తల్లిదండ్రులు మీడియాకు వెళ్లడించారు. తన బిడ్డను బతికించండంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఎన్‌టీఆర్‌లను వేడుకున్నారు. తమ కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని, బతికించాలంటూ వేడుకున్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి ఎన్‌టీఆర్‌ వరకు చేరింది. వెంటనే స్పందించిన జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తన అభిమాని కౌశిక్‌తో మాట్లాడేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు తన అభిమానులు ద్వారా కౌశిక్‌ తల్లిదండ్రులను సంప్రదించి వీడియో కాల్‌లో కౌశిక్‌తో మాట్లాడారు. నువ్వు నవ్వితే బాగున్నావ్‌ అంటూ ఎన్‌టీఆర్‌ అనగానే కౌశిక్‌ ఎమేషనల్‌ అయ్యాడు. థాంక్యూ అంటూ ఎన్‌టీఆర్‌కు కౌశిక్‌ బదులు ఇచ్చాడు. సార్‌ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదని చెప్పడంతో.. వెంటనే స్పందించిన ఎన్‌టీఆర్‌.. తాను మాట్లాడకపోతే ఎట్లా నీతో అంటూ ధైర్యం చెప్పారు. ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దని, త్వరగా కోలుకుని బయటకు రావాలని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తాను కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఆ తరువాత కౌశిక్‌ తల్లిదండ్రులతో కూడా తారక్‌ మాట్లాడారు. ’మీరు నవ్వుతూ ధైర్యంగా ఉంటే.. మీ బిడ్డ త్వరగా కోలుకుంటాడు. మీరు పక్కన ఉంటే అతనికి కొండంత బలంగా వస్తుంది’ అని ధైర్యం చెప్పారు. ఎన్‌టీఆర్‌ వీడియో కాల్‌ చేయడంతో కౌశిక్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తనకు 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్