కొత్త ఏడాదిలో ఐటీ ఉద్యోగాల జోష్.. డేటా సైన్స్, ఏఐ నిపుణులకు మంచి అవకాశాలు

భారత ఐటీ కంపెనీలకు 2025 సంవత్సరం మాత్రం ఆశావహంగానే కనిపిస్తోంది. అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముగియడం, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటం కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో వచ్చే జనవరి నుంచి పెద్ద కంపెనీలకు మళ్ళీ ప్రాజెక్ట్ రాక పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ తరువాత చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి 2024 చేదు అనుభవాన్ని మిగిల్చింది. రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో అమెరికా, యూరోపియన్ కంపెనీలు ఐటీ ఖర్చులను భారీగా తగ్గించేశాయి. దీంతో ఈ దేశాల నుంచి భారత కంపెనీలకు వచ్చే ఐటీ ప్రాజెక్టులు భారీగా తగ్గిపోయాయి. దీని ప్రభావంతో దేశీయ ఐటీ కంపెనీలో గడిచిన ఏడాది 2023 తో పోలిస్తే ఈ ఏడాది నియామకాలు జోరు ఏడు శాతం వరకు తగ్గింది. ఇది కూడా గ్లోబల్ గ్యాపబిలిటీ సెంటర్లు (జీసిసీ) ఆదుకోబట్టి మాత్రమే సాధ్యమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఐటీ కొలువుల నియామకాల్లో 52.6% వాటా జిసిసిలదే. కొత్త ప్రాజెక్టులు పెద్దగా రాకపోవడంతో ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్ లు భారీగా తగ్గించాయి. కొన్ని కంపెనీలు అయితే ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లని ఏదో ఒక పేరుతో వెనక్కి తీసుకున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే సస్పెన్షన్ లో పెట్టాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా 2023 తో పోలిస్తే ఈ ఏడాది ప్రెషర్ల నియామకాలు రెండు నుంచి 15% మాత్రమే పెంచాయి. ఈ ఏడాది ఐటి రంగంలో నియామకాల తగ్గిన కృత్రిమ మేధ (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి డొమైన్స్ లో పొట్టున్న నిపుణులకు మాత్రం మంచి అవకాశాలే లభించాయి. ఈ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల నియామకాలు గడిచిన ఏడాదితో పోలిస్తే 2024లో 39 శాతం పెరిగాయి. ఈ డిమాండ్స్ లో పట్టున్న నిపుణులు దొరకక చాలా ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులకే పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాయి. ఇక మంచి అనుభవం ఉన్న మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల నియామకాలు గడిచిన ఏడాదితో పోలిస్తే 35% పెరిగాయి. ఐటీ కంపెనీలు వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో ఈ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలపైనే దృష్టి పెట్టేవి. ఇవే కంపెనీలు ఇప్పుడు ద్వితీయశ్రేణి నగరాల పైన దృష్టి పెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు స్థానికంగా నిపుణులైన ఉద్యోగులు పుష్కలంగా దొరకడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ త్రేమాస్కంలో ద్వితీయశ్రేణి నగరాల్లోని ఐటీ కంపెనీల నియామకాలు 48 శాతం పెరిగాయి. 

కొత్త ఏడాదిపైనే ఎక్కువ ఆశలు..

భారత ఐటీ కంపెనీలకు 2025 సంవత్సరం మాత్రం ఆశావహంగానే కనిపిస్తోంది. అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముగియడం, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటం కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో వచ్చే జనవరి నుంచి పెద్ద కంపెనీలకు మళ్ళీ ప్రాజెక్ట్ రాక పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ తరువాత చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఐటీ కంపెనీలు ఎప్పటికీ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ నిపుణుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. వ్యాపార అవకాశాలు దొరకపుచ్చుకోవాలంటే ఏ ఐ వంటి అధునాతన టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం వెనకబడిన ఐటీ రంగంలో మనగలగడం కష్టం అంటున్నారు. దీంతో ఈ అధునాతన టెక్నాలజీపై పట్టున్న నిపుణుల నియామకాలు గడిచిన ఏడాదితో పోలిస్తే 2025లో 30 నుంచి 35% పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా. ఐటి పరిశ్రమ మొత్తంగా చూసిన 2025 లో నియామకాలు 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏఐ, ఎంఎల్ టెక్నాలజీల కారణంగా ఐటీ రంగంలో కొన్ని కొన్ని ఉద్యోగాలు మాయమయ్యే ప్రమాదము పొంచి ఉంది. ఏది ఏమైనా కొత్త ఏడాదిపై ఐటి రంగం భారీగానే అంచనాలను పెట్టుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్