కన్నీటి పర్యంతమైన జో బైడెన్.. షికాగో కన్వెన్షన్ లో చోటు చేసుకున్న ఘటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కన్నీటి పర్యంతమయ్యారు. షికాగో కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఒక సభలో వేదికపైన తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఈ సమావేశంలో మాట్లాడిన జో బైడెన్ అమెరికాలో రాజకీయ హింసకు తావు లేదని స్పష్టం చేశారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ లో ఆయన మంగళవారం భావోద్వేగంగా ప్రసంగించారు.

An emotional Joe Biden

భావోద్వేగానికి గురైన జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కన్నీటి పర్యంతమయ్యారు. షికాగో కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఒక సభలో వేదికపైన తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఈ సమావేశంలో మాట్లాడిన జో బైడెన్ అమెరికాలో రాజకీయ హింసకు తావు లేదని స్పష్టం చేశారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ లో ఆయన మంగళవారం భావోద్వేగంగా ప్రసంగించారు. కుటుంబ సమేతంగా బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆయన వేదిక పైకి రాగానే కుమార్తె యాసిన్ బైడెన్ పరిచయ వ్యాఖ్యలు మాట్లాడుతూ.. తన తండ్రిని ఆడపిల్లల పక్షపాతిగా పేర్కొన్నారు. ఆయన మహిళలకు విలువనివ్వడం, నమ్మడం తాను చూసినట్లు వెల్లడించారు. ఈ మాటలకు జో బైడెన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆయన పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు. అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి అమెరికా ఐ లవ్ యు అంటూ ప్రసంగం ప్రారంభించారు.  అమెరికాను తాను ఎల్లప్పుడూ ప్రేమిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, అగ్రగామి దేశంగా కొనసాగేందుకు నిరంతరం శ్రమించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఇంకా మాట్లాడిన బైడెన్.. అమెరికాలో రాజకీయ హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కచ్చితంగా కాపాడాలన్నారు. అమెరికా ఆత్మను కాపాడే యుద్ధంలో మనం ఉన్నామని వివరించారు. షార్లెట్ సెల్వీ  హింసకారులను ఉద్దేశించి శ్వేత సౌధాన్ని చూసుకొని నిర్భయంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారు హుడీస్ ధరించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. నాటి దృశ్యాలను చూసే తాను 2020 అధ్యక్ష పోరులోకి దిగినట్లు వెల్లడించారు. అమెరికా గౌరవం తనకు చాలా ముఖ్యమన్న బైడెన్.. అమెరికాలో విద్వేషానికి చోటు లేదని స్పష్టం చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా చేసిన ట్రంప్ ఆధ్వర్యంలో ఏ నిర్మాణమూ జరగలేదని, మంచి మౌలిక వసతులు లేకుండా ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎలా నిలవగలమని స్పష్టం చేశారు. ట్రంప్ నాలుగేళ్లలో ప్రతివారం మౌలిక వసతులపై వాగ్దానాలు చేస్తూ వెళ్లారని, కానీ పూర్తి చేయలేదన్నారు. కానీ మనం రోడ్లు, వంతెనలు, కోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైళ్లు, బస్సులను ఆధునికరించినట్లు వెల్లడించారు. అందరికీ హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చామని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేసినట్లు వివరించారు. జీవన ప్రమాణాలను పెంచామన్న బైడెన్, కుప్పకూలుతున్న దేశంగా అమెరికాను ట్రంప్ అభివర్ణిస్తారని పేర్కొన్నారు. ప్రపంచంలో మరో దేశంలో లేని విధంగా చిన్నారులు తుపాకులకు బలవుతున్నారని, ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు కమలా, తాను తుపాకుల చట్టాన్ని తెచ్చినందుకు గర్వపడుతున్నామన్నారు. ఇక ఆయుధాలను నిషేధించాల్సిన సమయం ఆసన్నమైందని జో బైడెన్ స్పష్టం చేశారు. ప్రసంగం ముగింపులో మాట్లాడుతూ తన బాధ్యతలను హ్యరీ కొనసాగిస్తారన్నారు. తన కెరీర్లో చాలా తప్పులు చేశానని, తన అత్యుత్తమ సేవలు 50 ఏళ్లుగా అమెరికాకు అందించినట్లు వివరించారు. దానికి లక్షల రెట్ల అభిమానం అమెరికా నుంచి లభించినట్లు పేర్కొన్నారు. అమెరికా పురోగతికి తాను నిరంతరం పరితపించినట్లు పేర్కొన్నారు. దేశం పట్ల అభిమానంతో ప్రతి ఒక్కరూ ఉండాలని సూచించారు. తాను కమలా - టిమ్ వాల్జ్ కు అత్యుత్తమ వాలంటీర్ వలే పని చేస్తానని జో బై డన్ హామీ ఇచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్