దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ) ముందుకు వచ్చింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ) లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ) ముందుకు వచ్చింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ) లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువుగా ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మొత్తంగా ఎనిమిది రకాల పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆరు కాగా, రెండు కౌంటర్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భక్తి చేయబోతున్నారు. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎస్ఎస్సి టైర్ వన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 30 ఏళ్లకు మించరాదు. రూల్స్ ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయసు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదివేల వయసు సడలింపు ఇచ్చారు. ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వరకు వేతనాన్ని చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ http://itdc.co.in ను సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.