నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు.!

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 206 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 200 పోస్టులు రెగ్యులర్ పోస్టులు కాగా, ఆరు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టులు వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులకు సంబంధించి పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తు చేసే అభ్యర్థులు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టి, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 206 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 200 పోస్టులు రెగ్యులర్ పోస్టులు కాగా, ఆరు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టులు వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులకు సంబంధించి పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తు చేసే అభ్యర్థులు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టి, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నారు. మొత్తం టెక్నికల్ పోస్టులు 206 కాగా ఇందులో టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైన్) 95, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ (ట్రైని) 95, టెక్నీషియన్ వెల్డర్ (ట్రైన్) 10 పోస్టులు ఉన్నాయి. పనిచేయాల్సిన విభాగాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఎక్స్కవేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. పోస్ట్ ను అనుసరించి మెట్రిక్యులేషన్ సంబంధిత ట్రేడిల్లో ఐటిఐ ఉత్తీర్ణత పొందడంతో పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అభ్యర్థులు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులు.

ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితులు సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ విద్యార్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు నిబంధనలు మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సంస్థ ఉద్యోగులకు ఎటువంటి గరిష్ట వైయోపరిమితి లేదు. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఉద్యోగాలను ఇవ్వనున్నారు. రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ ఏ నుంచి 70 ప్రశ్నలు ఉంటాయి. 70 ప్రశ్నలకు 70 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్ బి నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ సంస్థ కోరుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్