నిరుద్యోగులకు పలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ నోటిఫికేషన్‌ను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐటీడీసీ) విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా సదరు సంస్థ పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభిస్తుంది. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ)లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు పలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ నోటిఫికేషన్‌ను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐటీడీసీ) విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా సదరు సంస్థ పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభిస్తుంది. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీ)లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), కౌంటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా ఎనిమిది ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆరు జూనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) పోస్టులు ఉండగా, కౌంటర్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయి.
ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేయాలి. ఎస్‌ఎస్‌సీ టైర్-1లో అర్హత సాధించి ఉండాలి. అలాగే, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇక, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు ఏప్రిల్ ఒకటో తేదీ 2025 నాటికి 30 ఏళ్ల వయసు మించరాదు. రూల్స్ ప్రకారం వయసు సడలింపు లభిస్తుంది. ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయసు సడలింపు లభిస్తుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయసు సడలింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,970 నుంచి రూ.71,610 వరకు వేతనం లభిస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ నుం సంప్రదించాలని సూచించింది.