నిరుద్యోగ యువతకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలను అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎమ్) ముందుకు వచ్చింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఐఐఎఫ్ఎం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు అనుగుణంగా ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనాలను అందించనుంది.
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగ యువతకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలను అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎమ్) ముందుకు వచ్చింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఐఐఎఫ్ఎం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు అనుగుణంగా ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనాలను అందించనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో వివిధ రకాల వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ప్రస్తుతం భర్తీ చేస్తున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి. ఇందులో మూడు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కాగా, రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 25వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు. ఉద్యోగాన్ని బట్టి సంబందించిన విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఉద్యోగానికి ఈ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించరాదు. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ళ వయసు సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం అందించనున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ కు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నెలకు 30000 చొప్పున జీతాన్ని చెల్లించనున్నారు. నోటిఫికేషన్ కోసం మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైటు http://iifm.ac.in ను సంప్రదించాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆయా ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు అందిస్తుండటంతో ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.