ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. స్పెషలిస్ట్ గ్రేడ్ పోస్టులే ఎక్కువ.!

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. న్యూఢిల్లీలోని కార్యాలయం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా 558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్, ఎండి, ఎంసిహెచ్, డిఎం, డిఏ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ, డిపిఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో మే 26వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. న్యూఢిల్లీలోని కార్యాలయం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా 558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్, ఎండి, ఎంసిహెచ్, డిఎం, డిఏ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ, డిపిఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో మే 26వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 155 కాగా.. ఈ పోస్టులకు కార్డియాలజీ, కార్డియా థొరాసిక్  సర్జరీ, కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి రీజియన్ విషయానికి వస్తే బీహార్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, యూపీ రీజియన్లుగా విభజించారు. స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ విభాగానికి సంబంధించి 403 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులను అనస్థీషియా, బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ అండ్ ఎస్టిడి, ఈఎన్టీ, ఆప్తాలమాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, గైనకాలజీ, ఆర్తో, పీడియాట్రిక్స్, పెథాలజీ, పలమనేరి మెడిసిన్, రేడియాలజీ, సైకియాట్రి, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు భర్తీకి సంబంధించిన రీజియన్లను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, అస్సాం, చండీఘడ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, బీహార్, చత్తీస్గడ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్, ఎండి, ఎంసిహెచ్, డీఎం, డిఎ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ, డిపిఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2025 మే 26 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మహిళ ఈఎస్ఐసి ఉద్యోగులు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు స్పెషలిస్ట్ గ్రేడ్ 2 సీనియర్ స్కేల్ కు రూ.78,800, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 నా స్కేల్ పోస్టుకు రూ.67,700 చొప్పున చెల్లించనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్