పదో తరగతి అర్హతతో కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు.. భారీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కేంద్ర భద్రతా దళాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే సిఆర్పిఎఫ్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) లో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్/మోటార్ మెకానిక్ (కాంబోటైజ్డ్) పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

CRPF Security Forces

 సిఆర్పిఎఫ్ భద్రతా దళాలు 

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర భద్రతా దళాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే సిఆర్పిఎఫ్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) లో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్/మోటార్ మెకానిక్ (కాంబోటైజ్డ్) పోస్టులను భర్తీ చేయనున్నారు  అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను పరిశీలిస్తే.. సిఆర్పిఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ / మోటార్ మెకానిక్ (కాంబాటైజ్డ్) రిక్రూట్మెంట్ విభాగంలో 124 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థి వయసు 56 ఏళ్లకు మించరాదు. అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్ లో ఐటిఐ సర్టిఫికెట్ లేదా మూడేళ్ల అసిస్టెంట్ అప్రెంటిస్ షిప్ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక విధానం పలు దశల్లో ఉంటుంది. ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనున్నారు. రెండో దశలో ఇంటిగ్రిటీ అండ్ విజిలెన్స్ క్లియర్, ఆ తరువాత ఫైనల్ ఎంపిక ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ అన్నది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, క్లియరెన్స్ సర్టిఫికేషన్ పై ఆధారపడి ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.

ఆయా పోస్టులకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు నెలకు జీతం నేలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. దరఖాస్తుదారులు ముందుగా సిఆర్పిఎఫ్ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజీలోకి వెళ్లి సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మోటార్ మెకానిక్ రిక్రూట్మెంట్ 2024 అనే లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ ఎడ్యుకేషన్ వివరాలతో అప్లికేషన్ ను ఫీల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లికేషన్ కు జత చేయాలి. గడిచిన ఐదేళ్ల అప్రెంటిస్ షిప్ కాపీ, ఇంటిగ్రిటీ అండ్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ వంటివి తప్పనిసరిగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా ఐడిజి (ఈఎస్టిటీ), డైరెక్టర్ జనరల్, సిఆర్పిఎఫ్, బ్లాక్ నెంబర్-1, సిజివో కాంప్లెక్స్, లోధి రోడ్డు, న్యూఢిల్లీ - 110003 అనే అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారం నోటిఫికేషన్ వెలువడిన 60 రోజుల్లో పేర్కొన్న అడ్రస్ కు చేరాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. సిఆర్పిఎఫ్ యాక్ట్ 1949, రూల్స్ 1955 ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగనుంది  ఎంపికయ్యే అభ్యర్థులకు అవసరమైన విధంగా శారీరిక, వృత్తిపరమైన శిక్షణను ఇవ్వనున్నారు. ఆశావహ అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్