కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని భావించే వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ముఖ్యంగా ఆర్ముడు ఫోర్సెస్లో మెడికల్ సర్వీసెస్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019 ప్రకారం గుర్తింపు పొందిన వైద్య అర్హత కలిగి ఉండాలి. ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని భావించే వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ముఖ్యంగా ఆర్ముడు ఫోర్సెస్లో మెడికల్ సర్వీసెస్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019 ప్రకారం గుర్తింపు పొందిన వైద్య అర్హత కలిగి ఉండాలి. ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రాష్ట్ర వైద్య మండలి / ఎంసీఐ / ఎన్బీఈ/ ఎన్ఎంసీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ ను కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అర్హులు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. పిజి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల వయసు 35 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు 200 చెల్లించాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపిక అయ్యే వారికి భారీ వేతనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్ముడు ఫోర్సెస్ లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు చాలా పోటీ కూడా ఉంటుంది. అయితే పోస్టులకు సంబంధించి వివరాలను పరిశీలిస్తే 400 ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు గడువు కూడా ఎక్కువ రోజులు ఉండడంతో అభ్యర్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్ముడ్ ఫోర్సెస్ లో పనిచేసే సిబ్బందికి వైద్య సేవలు అందించేందుకు ఈ మెడికల్ ఆఫీసర్లు ఉపయోగపడతారు. అందుకే వివిధ ప్రాంతాల్లోని ఆర్మీ క్యాంపులకు సంబంధించి ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టులను తాజాగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎప్పటికీ పహల్గడ్ ప్రాంతంలో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత పెద్ద ఎత్తున భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధానికి పరిస్థితులు దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. పాకిస్తాన్ కు గట్టిగా బదులు చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు ఉంటాయని కూడా తెలుస్తోంది. దేశంలోని ప్రజలు కూడా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.