ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా విభాగాలకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని 8 పోస్టులు, టెక్నీషియన్ సీ కేటగిరీకి సంబంధించిన 21 పోస్టులను, మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ బిఈఎల్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆశావహులైన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సంస్థ ఆహ్వానిస్తోంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ, డిప్లమో, ఐటిఐ లో ఏదో ఒకటి పాసై ఉండాలి.
ప్రతీకాత్మక చిత్రం
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా విభాగాలకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని 8 పోస్టులు, టెక్నీషియన్ సీ కేటగిరీకి సంబంధించిన 21 పోస్టులను, మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ బిఈఎల్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆశావహులైన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సంస్థ ఆహ్వానిస్తోంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ, డిప్లమో, ఐటిఐ లో ఏదో ఒకటి పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు మార్చి ఒకటో తేదీ 2025 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వు కేటగిరి వర్గాలకు వయసు సడలింపు నిబంధనలు వర్తిస్తాయని ఈ ప్రకటనలో పేర్కొంది. ఈ పోస్టర్కు అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించి ప్రత్యేకమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు. రాత పరీక్షలో ఎంపికైన వారికి టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కు రూ.21,500 నుంచి రూ.82,000 వరకు వేతనం అందించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఉద్యోగానికి ఎంపికయ్య అభ్యర్థులకు రూ.24,500 నుంచి 90 వేల వరకు జీతం అందిస్తారు. జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మిగిలిన కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కల్పించారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు సంస్థ అవకాశం కల్పించింది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సదరు సంస్థ ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ భారీ వేతనంతో ఉద్యోగాలను కల్పించేందుకు ప్రకటన విడుదల చేయడంతో అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తులను చేసేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. భారీ వేతనాలతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో వారంతా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని నెలల తర్వాత ఖాళీలు భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.