నిరుద్యోగులకు శుభవార్త అందించింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మంగళగిరి ఎయిమ్స్ లో ఉన్న పలు ఉద్యోగాలు భర్తీకి తాజాగా ఈ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎయిమ్స్ అధికారులు ప్రకటనలో కోరారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్) మంగళగిరిలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 25వ తేదీ వరకు అవకాశం ఉంది. గడువులోగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో కోరారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన మొత్తం 50 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు శుభవార్త అందించింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మంగళగిరి ఎయిమ్స్ లో ఉన్న పలు ఉద్యోగాలు భర్తీకి తాజాగా ఈ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎయిమ్స్ అధికారులు ప్రకటనలో కోరారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్) మంగళగిరిలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 25వ తేదీ వరకు అవకాశం ఉంది. గడువులోగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో కోరారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన మొత్తం 50 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల జాబితాలో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ప్రొఫెసర్ పోస్టులు ఏడు, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు మూడు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 32 భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఆయా పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో ఎండి, ఎంఎస్, డిఎం, ఎంఫిల్, ఎంఎస్సీ, ఎంసిహెచ్ పాసై ఉండాలి.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3,100 ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టి, మహిళా అభ్యర్థులకు రూ.2,100 గా ఫీజును నిర్ణయించారు. ఇంటర్వ్యూ ద్వారా ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆయా ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి రూ.1,01,500 నుంచి రూ.1,68,900 వరకు వేతనం చెల్లించనున్నారు. నెలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,68,000 జీతం చెల్లిస్తారు. అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.1,48,200 జీతం చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,38,300 జీతం చెల్లించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.1,01,500 జీతం చెల్లించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్ https://www.aiimsmangalagiri.edu.in/vacancies సంప్రదించవచ్చు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా దరఖాస్తు చేసుకోండి.