|| జేఎన్టీయూ హైదరాబాద్ ||
విద్యార్థులకు శుభవార్త తెలిపిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. విద్యార్థులకు ఇంజనీరింగ్ తో పాటు డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. 2022-2023 విద్యాసంవత్సరం తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కొక్క కళాశాలలో 60 సీట్లు కేటయించగా 30 శాతం విద్యార్థుల రిజిస్ట్రేషన్ అయితేనే కళాశాలకు అనుమతించనున్నారు. రిజిస్టర్ చేసుకునే విద్యార్థులు ఇంజనీరంగ్ 2,3,4 సంవత్సారాల వారే అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. రిజిస్టర్ అయిన విద్యార్థులకు శని ఆదివారాలు లలో మాత్రమే తరగతులు నిర్వహించి మిగిత రోజుల్లో ఆన్ లైన్ తరగతులు నిర్వహించనున్నారు. BBA ప్రవేశ తరగతుల కోసం విద్యార్థులు సంవత్సరానికి రూ. 60 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడు సంవత్సరాలకు రూ.1.80 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది.
విద్యార్థులు బిటెక్ తోపాటుగా BBA కోర్సును కూడా పూర్తి చేయవచ్చు. 3 నుండి 6 సంవత్సారాలలో కోర్సు పూర్తి చేయాలి. దీనికి సంబందంచిన రూల్స్, రెగ్యులేషన్స్ కోసం సన్నాహాలు చేసి ఫిబ్రవరి నుంచి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నమని జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. దీంతో విద్యార్థులకూ మంచి క్రెడిట్స్ తో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని జేఎన్టీయూ ఈ నిర్ణయం తీసుకుంది.